ఇంతకీ సంగతేంటంటే..
ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లీ తన వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను తరుచూ అభిమానులతో పంచుకుంటాడు. అలానే జిమ్‌లో చమటోడుస్తున్న ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకు విరాట్ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ‘ఇక్కడున్న విపరీతమైన వేడిలో నా రొటిన్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోలో వెనుక నుంచి ఎందుకు అరుస్తున్నాడో క్రిస్ మోరిస్‌ను అడగండి'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

నీవు ఎప్పుడూ వేసుకోవు కాబట్టి..
ఇక ఈ వీడియోకు చాహల్ ఫన్నీ కామెంట్ చేశాడు. ‘కోహ్లీ భయ్యా నా షార్ట్ ఎందుకు వేసుకున్నావ్?'అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. దీనికి విరాట్ కూడా అదే శైలిలో బదులిచ్చాడు. ‘నువ్వు ఎప్పుడూ షార్ట్స్ వేసుకోవు కాబట్టి.. నేను వేసుకున్నా'అని దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఇక విరాట్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ కూడా ట్రోల్ చేశాడు.‘నువ్వు వేసుకున్న షార్ట్స్‌తో నేను ఆందోళనకు గురవుతున్నా'అని సరదాగా కామెంట్ చేశాడు. దీంతో ఈ వీడియో, కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఒకటి గెలిచి మరొకటి ఓడి..
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 10 పరుగులతో సూపర్ విక్టరీ అందుకొని బోణీ కొట్టింది. అయితే అదే జోరును కొనసాగించలేకపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 97 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. బెస్ట్ ఫీల్డర్ అయిన విరాట్.. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లు జారవిడిచి.. ఆర్‌సీబీ ఓటమికి కారణమయ్యాడు. అటు బ్యాటింగ్‌లో కూడా దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ సీజన్‌లో కోహ్లీ ఇంకా తన మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేదు.


Click it and Unblock the Notifications












