Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. మోగిన రికార్డుల మోత! ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా..

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో సతమతమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్వేచ్చగా ఆడిన విరాట్.. అభిమానులకు ఒకప్పటి తన ఆట రుచిని చూపించాడు.
ఎలాంటి ఆందోళన లేకుండా చాలా కూల్‌గా ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పైనే తన తొలి హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. దానికి మించిన జోరును తాజా మ్యాచ్‌లో చూపించాడు. విరాట్ బ్యాట్ నుంచి పరుగులు రావడంతో అతని పేరిట రికార్డుల మోత కూడా మోగింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రైనా, ధావన్ రికార్డు బ్రేక్..
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్రతీ సీజన్‌లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో విరాట్ 309 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. దాంతోనే విరాట్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్, సురేశ్ రైనా పేరిట ఉన్నరికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ ఇప్పటి వరకు 13 సార్లు 300కు పైగా పరుగులు చేయగా.. సురేశ్ రైనా, ధావన్ 12 సార్లు ఈ ఘనతను అందుకున్నారు.

ఆర్‌సీబీ 7000
ఆర్‌సీబీ తరపున ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో ఆర్‌సీబీలో జాయిన్ అయిన కోహ్లీ అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఇందులో 424 పరుగులు చాంపియన్స్ లీగ్‌లో సాధించగా.. మిగతా పరుగులన్ని ఐపీఎల్‌లో వచ్చినవే.

23 సార్లు 100 పరుగుల భాగస్వామ్యం..
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు విరాట్ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 ప్లస్ రన్స్ భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల పార్టన్‌ర్‌షిప్ మూడు సార్లు నమోదు చేశాడు.

ఒకే జట్టుపై రెండు హాఫ్ సెంచరీలు..
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒకే జట్టుపై రెండు హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 53 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్.. తాజా మ్యాచ్‌లో 73 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా గుజరాత్‌పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 2016లో గుజరాత్ లయన్స్‌పై విరాట్ రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదాడు. తొలి మ్యాచ్‌లో 63 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ రెండో మ్యాచ్‌లో 55 బంతుల్లో 109 రన్స్ చేశాడు. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ ఫైనల్లో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications