For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డార్లింగ్ అంటూనే విమర్శకులను గట్టిగా ఏసుకున్న కోహ్లీ.. ట్వీట్ వైరల్!

Virat Kohli sends strong message to critics through social media post

లండన్: ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కోహ్లీ జట్టుకు భారంగా మారాడని, అతన్ని జట్టు నుంచి తప్పించాలని కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు విమర్శించగా.. గవాస్కర్ వంటి ప్లేయర్లు వెనకేసుకు వస్తున్నారు. విరాట్ కోహ్లీ సత్తా, సామర్థ్యం చూసి మాట్లాడాలని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా అండగా నిలిచాడు. బయటి వారికి ఏం తెలియదని, విరాట్ ఫామ్‌పై తమకు క్లారిటీ ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన సహచర ఆటగాడికి మద్దతు తెలిపాడు. పాక్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా విరాట్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు.

 డార్లింగ్ అంటూనే...

డార్లింగ్ అంటూనే...

దాంతో సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక తన ఫామ్‌పై తీవ్రంగా సాగుతున్న చర్చపై విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగానే తనదైన శైలిలో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఘాటు పదాలు వాడకుండానే సుతిమెత్తని సూక్తితో ఆలోచనలో పడేసాడు. డార్లింగ్ అంటూనే గట్టిగా ఏసుకున్నాడు. '​డార్లింగ్‌.. నేను కింద పడితే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి..?'అంటూ విమర్శకులను ఉద్దేశించి ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

భారీ అంచనాలతోనే..

భారీ అంచనాలతోనే..

కోహ్లీ 2019 నవంబర్‌లో తన ఆఖరి సెంచరీ బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్‌ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ సచిన్‌ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లీపై అంచనాలు పెంచేసుకున్నారు. కోహ్లీ 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్‌ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది.

 యువ ఆటగాళ్లతో పోటీ..

యువ ఆటగాళ్లతో పోటీ..

నిజానికి సెంచరీలు లేకపోయినా కోహ్లీ ఆట ఘోరంగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చక్కటి షాట్లు, కళాత్మక ఆటతీరులో ఎక్కడా తేడా రాలేదు. క్రీజ్‌లో తడబడటం, షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడటం కూడా కనిపించలేదు. నాటింగ్‌హామ్‌లో జరిగిన చివరి టీ20లో మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన ఫోర్, ఆ తర్వాత నేరుగా కొట్టిన సూపర్‌ సిక్సర్‌ కోహ్లీ సత్తా ఏమిటో చూపించాయి. ఇటీవల అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు కోహ్లీని సాధారణ బ్యాటర్‌గా చూపిస్తోంది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతుండటం.. కోహ్లీ కోసం వీరిని పక్కనపెట్టాల్సిన పరిస్థితులు వస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది.

 ఇతరుల కంటే మెరుగ్గానే..

ఇతరుల కంటే మెరుగ్గానే..

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ 24 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్‌ గణాంకాలు. 2020 జనవరి నుంచి విరాట్ 21 అంతర్జాతీయ టీ20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదీ టీ20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్‌ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అతి సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు.

Story first published: Saturday, July 16, 2022, 17:17 [IST]
Other articles published on Jul 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+