నాయకుడిగా ఉండాలంటే కెప్టెనే కానక్కర్లేదు: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: జట్టులో నాయకుడిగా ఉండాలంటే కెప్టెనే కానక్కర్లేదని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. జట్టులో ఆటగాడిగా ఉండి కూడా సారథిలా ఆలోచన చేయవచ్చని, తాను అలానే చేస్తానని చెప్పాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉదహారణగా పేర్కొంటూ నాయకత్వంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అంతకుముందు వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ అతన్ని తప్పించగా.. టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అతనే వదులుకున్నాడు. దాంతో ఏడేళ్ల అతని కెప్టెన్సీ ప్రస్థానానికి ఎండ్‌కార్డ్ పడింది.

బ్యాటింగ్‌పై ఫోకస్..
ఈ నేపథ్యంలోనే 'ఫైర్ సైడ్ చాట్ విత్ వీకే' కార్యక్రమంలో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టి జట్టు విజయానికి కృషి చేస్తానని చెప్పాడు. 'ప్రతీ దానికి కాలపరిమితి ఉంటుందనే విషయం గురించి తెలుసుకోవాలి. ప్రజలంతా మీరు ఏం సాధించారని అనవచ్చు. కానీ నీవు ముందుకు సాగాలని, మరిన్నీ ఘనతలను అందుకోవాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించారనిపిస్తోంది.

ఇప్పటికీ ధోనీ దగ్గర..
నేను బ్యాట్స్‌మన్‌గా జట్టు విజయాల కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నా. జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తే నాకు మరింత గౌరవం దక్కుతుంది. నాయకుడిగా ఉండటానికి కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నప్పుడు అతను నాయకుడిగా లేనట్లు కాదు. ఇప్పటికీ మేం అతని దగ్గర విలువైన సలహాలు తీసుకుంటూనే ఉంటాం. గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. ప్రతిరోజు మెరుగ్గా ఉండాలనేది మన చేతుల్లో ఉండదు.. స్వల్పవ్యవధిలో చేయగలిగింది కాదు.

అవగాహన ఉండాలి..
జట్టులో ఉన్నన్నాళ్లు అది మన బాధ్యత. అలా ముందుకు సాగడం కూడా నాయకత్వంలో ఓ భాగమే. అన్ని రకాల బాధ్యతలు, అవకాశాలను స్వీకరించాలని భావిస్తాను. ధోనీ నేతృత్వంలో కొంతకాలం ఆడాను. తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాను. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటికీ కెప్టెన్‌గానే ఆలోచిస్తాను. ముందుగా ఏమి సాధించాలనుకుంటున్నాం.. ఆ లక్ష్యాలను సాధించామా లేదా అనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతిఒక్కరూ అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శన చేయగలరు. అది గర్వించాల్సిన విషయం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications