Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli Press Conference: డబ్ల్యూటీసీ ఫైనల్లో మేం ఓడిపోతే ప్రపంచం ఆగిపోదు!

 Virat Kohli says Win or lose this game, cricket does not stop for us ahead of WTC Final

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో తాము ఓడిపోయినంత మాత్రాన ప్రపంచమేం ఆగిపోదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కేవలం ఈ ఐదు రోజుల్లోని ఆటతో వచ్చే ఫలితంతో తమ సత్తా డిసైడ్ కాదన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఈ ఫైనల్‌ మ్యాచ్ తమకు మరో సాధారణ మ్యాచ్‌ అని చెప్పాడు. గత నాలుగైదేళ్లలో తమ ఆటను అర్థం చేసుకున్న వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారని వెల్లడించాడు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లకు తమకు మంచి స్నేహితులని, కానీ అది మైదానం బయటవరకేనని స్పష్టం చేశాడు.

మరో మ్యాచ్ మాత్రమే..

మరో మ్యాచ్ మాత్రమే..

'ఈ ఐదు రోజుల పాటు జరిగే ఒక్క మ్యాచ్ ఫలితంతో తమ సత్తా డిసైడ్ కాదు. కొంతకాలంగా మా ఆటను గమనిస్తున్న వాళ్లకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరిత్రను మీరోసారి పరిశీలించండి. ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు. దానిని బట్టి ఇదొక ఆట అని అర్థమవుతుంది. ఫైనల్లో మేము గెలిచినా ఓడినా క్రికెట్ కొనసాగుతుంది. అందుకే ఈ ఫైనల్‌ను మరీ ప్రత్యేకంగా చూడటం లేదు. మమ్మల్ని మేము మెరుగుపర్చుకునే తపనలో మార్పు ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా ఫైనల్ ఎలెవన్‌ను ఎంచుకున్నాం. నా వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మరో మ్యాచ్ మాత్రమే.

బయటివారికే ఆతృత

బయటివారికే ఆతృత

కానీ బయటి వ్యక్తులకు ఇది చావోరేవోలా అనిపిస్తుంది. కానీ ఈ మూమెంట్‌ను మేమంతా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. మా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించారు. ఈ ఫైనల్‌ చేరుకొనేందుకు మేమెంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. జట్టుగా మేమేంటో మాకు తెలుసు. ఓ బలమైన ప్రత్యర్థితో తలపడుతున్నామనే విషయం కూడా మాకు తెలుసు. అందుకే స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విలియమ్సన్ నేను మంచి స్నేహితులం. కివీస్ ప్లేయర్లందరితోనూ మాకు మంచి సంబంధం ఉంది. కానీ అదంతా ఫీల్డ్ బయటే. బరిలోకి దిగాక విలియమ్సన్ ఎప్పుడెప్పుడు పెవిలియన్‌కు పంపాలనే ఆలోచిస్తా.' అని విరాట్‌ వెల్లడించాడు.

 రాత్రికి రాత్రే నిర్ణయాలు వద్దు..

రాత్రికి రాత్రే నిర్ణయాలు వద్దు..

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పద్ధతిని మధ్యలో మార్చడం సరికాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచమంతా స్తంభించినప్పుడు, ఆటగాళ్లంతా ఇళ్లలో ఉన్నప్పుడు మార్చడమేంటని ప్రశ్నించాడు. కనీసం ఇకనైనా రాత్రికి రాత్రే ఏ మార్పులూ చేయొద్దని సూచించాడు. పాయింట్ల విధానం మార్చాక ఫైనల్‌ చేరుకొనేందుకు ఎంతో కష్టపడ్డామని వివరించాడు. అంకితభావం, పట్టుదలతో ఆడి ఈ స్థితికి చేరుకున్నామని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సాయశక్తులా కృషిచేస్తామని తెలిపాడు.

 భారత్ బలం తెలుసు..

భారత్ బలం తెలుసు..

భారత్ బలమెంటో తమకు తెలుసని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. 'వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఈ రెండేళ్లలో మా టీమ్ మెరుగుదలకు నిదర్శనం. ఈ సమయంలో ప్రతీ రోజు మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. మాటీమ్ వాటిని దాటుకొని ముందుకొచ్చింది. ఈ క్రమంలో చాలా బలంగా మారింది. ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు మేం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫైనల్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తున్నా.. మా ప్రగతిని కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అన్న ట్యాగ్ గురించి మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. మా ఫోకస్ మొత్తం ఆటపైనే పెట్టాం. ఎందుకంటే వరల్డ్‌లో ఎక్కడైనా భారత్ చాలా బలమైన జట్టు. వాళ్లతో గట్టి పోటీ తప్పదని మాకు తెలుసు.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, June 18, 2021, 14:01 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+