Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే మా కొంప ముంచింది: విరాట్ కోహ్లీ

Virat Kohli says We werent aware of what we had to do on that pitch
Ind vs Eng 1st T20I : 'We Weren't Aware Of What We Had To Do On That Pitch' - Virat Kohli

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామని, అదే తమ ఓటమికి కారణమైందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన విరాట్.. జట్టుగా తాము చేసిన తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నామన్నాడు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమవ్వడంతో పాటు అనవసర షాట్స్‌కు పోయి వికెట్లు పారేసుకున్నామన్నాడు.

 అంచనా వేయలేకపోయాం..

అంచనా వేయలేకపోయాం..

'ఈ పిచ్‌పై ఎలా ఆడాలో మాకు అవగాహన లేకపోయింది. మేము ఆశించిన విధంగా షాట్స్‌ను ఆడలేకపోయాం. బంతి బౌన్స్ అవుతున్నప్పుడు ఎలా ఆడాలో... శ్రేయస్ అయ్యర్ మాకు చూపించాడు. కానీ.. అప్పటికే చాలా వికెట్లు చేజార్చుకున్నాం. చివరి 10 ఓవర్లప్పుడు చేతిలో 8 వికెట్లు ఉంటే ఇంగ్లండ్ ముందు పోరాటే స్కోర్‌ను ఉంచేవాళ్లం. కానీ ఈ పిచ్‌పై షాట్ సెలక్షన్‌లో విఫలమయ్యాం. నిజాయితీగా తప్పుల్ని అంగీకరించాలి. రెండో టీ20లో ఆ తప్పిదాల్ని దిద్దుకుని.. బలంగా బరిలోకి దిగుతాం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 అదేం కాదు..

అదేం కాదు..

ఇక ఫార్మాట్ మారడం వల్ల బ్యాటింగ్‌లో తడబడ్డారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ అలాంటిదేం లేదని, గతంలో చాలా సీరీస్‌లు ఆడి గెలిచామని విరాట్ గుర్తు చేశాడు. 'ఫార్మాట్లకు తగ్గట్లు ఆటను మార్చుకోవడం అంత కష్టమేమి కాదు. గతంలో కూడా మేం ఇలాంటి పరిస్థితుల్లో ఆడాం. ఇదే మా ఆటపై ప్రభావం చూపిందని అనుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మేం వైట్ బాల్‌ క్రికెట్‌లో బాగానే రాణిస్తున్నాం. ఇలా ఫార్మాట్లకు తగ్గట్లు మా ఆటను మార్చుకుంటూ విజయాలందుకున్నాం. సిరీస్‌లు గెలిచాం. అయితే టీ20 ప్రపంచకప్ ముందు మాకున్న టీ20 సిరీస్ ఇదొక్కటే. అందుకే కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. అలాగని తేలికగా తీసుకోవడం లేదు.'అని విరాట్ స్పష్టం చేశాడు.

 కోహ్లీ చెత్త రికార్డు..

కోహ్లీ చెత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్‌ సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్‌ అయిన రికార్డును చెరిపేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 14 సార్లు డకౌట్‌ అయిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్‌ ధోని 11 సార్లు, కపిల్‌ దేవ్‌ 10 సార్లు, మహ్మద్‌ అజారుద్దీన్‌ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు.

 ఇంగ్లండ్ పంచ్..

ఇంగ్లండ్ పంచ్..

ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. స్పిన్నర్లపై బ్యాట్‌ ఝుళిపించిన జేసన్‌ రాయ్‌ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జోఫ్రా ఆర్చర్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.

Story first published: Saturday, March 13, 2021, 11:10 [IST]
Other articles published on Mar 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+