Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆటగాడిగా చాలా ఇబ్బంది పడ్డా: విరాట్ కోహ్లీ

 Virat Kohli Says Tough Transition From Captain To A Player

న్యూఢిల్లీ: ఐసీసీ టైటిళ్లు గెలవలేదని ఫెయిల్యూర్ కెప్టెన్‌గా తనపై ముద్ర వేసారని తెలిపిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సారథ్యం కోల్పోయిన తర్వాత ఆటగాడిగా కొనసాగడం చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ఆటగాడిగా జట్టులో సర్దుకోవడానికి తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. ఇక వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో మనస్థాపానికి గురైన కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని కూడా వదిలేసిన విషయం తెలిసిందే. సుమారు ఏడేళ్ల పాటు టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టును నాలుగేళ్లు నడిపించాడు. తాజాగా ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ప్లేయర్‌గా జట్టులో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు.

 కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఇబ్బంది పడ్డా..

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఇబ్బంది పడ్డా..

'సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆటగాడిగా జట్టులో సర్దుకోవడానికి కొద్ది రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే సారథ్యం వహించిన ప్రతీ ఒక్కరికీ ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. పైకి అలాంటిదేం లేదని చెప్పినా.. కెప్టెన్‌గా జట్టులో జరిగే ప్రతీ చిన్నదానికి బాధ్యత వహించి ఒక్కసారిగా ఆ స్థానంలో లేమనే నిజాన్ని గ్రహించడం చాలా కష్టం. కెప్టెన్‌ను కాదనే విషయాన్ని వొంటబట్టించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. జట్టులో ఓ సాధారణ ప్లేయర్‌గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

నువ్వు కెప్టెన్ కాదు బాస్..

నువ్వు కెప్టెన్ కాదు బాస్..

కెప్టెన్సీ అలవాటులో భాగంగా మైదానంలో కొన్నిసార్లు ఏదో నిర్ణయం తీసుకోవడానికి, సలహాలు చెప్పడానికి ముందుకు వచ్చేవాడిని. ఆ వెంటనే 'నువ్వు కెప్టెన్ కాదురా అయ్యా'అనే విషయాన్ని నాకు నేను చెప్పుకునేవాడిని. చాలాసార్లు ఏదో చెప్పాలని అనుకునేవాడిని. అలా చాలా సార్లు.. అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి వెనకడుగు వేసేవాడిని. నిర్ణయం తీసుకున్నాక మనం అభిప్రాయం చెప్పడం కూడా మంచిది కాదు. మన అభిప్రాయానికి విలువ లేదని తెలిసినా చెప్పడం అవివేకమే అవుతుంది.

సహచర ఆటగాళ్లు గౌరవం ఇవ్వరు..

సహచర ఆటగాళ్లు గౌరవం ఇవ్వరు..

జట్టులో కెప్టెన్సీ హోదా అనుభవించిన తర్వాత ఓ సాధారణ ప్లేయర్‌గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. జట్టులో మనల్ని ఒకలా చూసిన వాళ్లు కూడా సారథ్యం కోల్పోయిన తర్వాత మరోలా చూడటం మొదలుపెడుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసుని చాలా బాధపెడతాయి.

అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఆర్‌సీబీ కెప్టెన్సీ విషయంలో నా నిర్ణయం సరైనదే అనిపించింది. ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరకు వెళ్లి, ఇది చేస్తే బాగుంటుందని ఏ విషయాన్నైనా గట్టిగా చెప్పగలను. నా నిర్ణయాన్ని అతను సంతోషంగా స్వీకరిస్తాడు. అది అతను నాకిచ్చే గౌరవం.' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీకి గౌరవం ఇస్తలేడా? అనే చర్చ ఊపందుకుంది.

Story first published: Monday, February 27, 2023, 21:26 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+