Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోట్ల మంది అభిమానులు ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించా.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

Virat Kohli says Sometimes in a room full of people who love me, I felt alone

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌గా, స్టార్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ఎంత ఘనమైందో అందరికీ తెలుసు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడిచచ్చేవారున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 200 మిలియన్ల ఫాలోయర్లు ఉన్న ఏకైక క్రికెటర్. అత్యంత ఆధరణ పొందిన తొలి ఆసియా ప్లేయర్. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంతటి ఆస్థి.! ఇన్ని ఉన్నా.. విరాట్ కోహ్లీ ఒంటరితనానని అనుభవించాడట. తీవ్ర మానసిక సమస్యలతో గడిపాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. క్రీడాకారులు ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ హెల్త్‌పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని, లేదంటే అది పతనానికి దారితీస్తుందని కోహ్లీ తెలిపాడు.

ఒంటరితనాన్ని అనుభవించా..

ఒంటరితనాన్ని అనుభవించా..

తాను కెరీర్‌ను నిర్మించుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. 'క్రీడలు అథ్లెట్‌లోని ఉత్తమ ఆటను బయటకు తీసుకురాగలవు. నిరంతరం ఒత్తిడిలో ఆడటం వల్ల అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. ఇది తీవ్ర సమస్య. దృఢంగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు మానసిక ఒత్తిడి క్రీడాకారుడిని కుంగదీసే ప్రమాదముంది. నేనూ ఈ సమస్యతో బాధపడ్డాను. ఎలాంటి సమయంలోనైనా మద్దతుగా నిలుస్తూ, ప్రేమించే సభ్యులు చుట్టూ ఉన్నా.. కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించాను. చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురైవుండొచ్చు.

అందుకే కుటుంబంతో ఎక్కువ గడుపుతా..

అందుకే కుటుంబంతో ఎక్కువ గడుపుతా..

దీని నుంచి బయటపడేందుకు ఒకటే మార్గం. నీకు నువ్వు సమయం కేటాయించి.. నీతో నువ్వు గడుపు. అలా చేయలేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూలేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఫిట్‌గా ఉండటం, శారీరక, మానసిక ఒత్తిడి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవడంపై దృష్టిసారించడం అథ్లెట్లకు కీలకం. తీరిక లేని షెడ్యూల్‌ నుంచి పునరుత్తేజం పొందడానికి నేను కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను. నా అభిరుచులను కొనసాగించడానికి సమయం కేటాయిస్తాను. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయాణం చేస్తుంటాను. అంతేకాదు.. కాఫీ తాగుతాను. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కాఫీ రుచులు ఆస్వాదిస్తాను'అని చెప్పాడు.

నోటికి తాళం వేసాను..

నోటికి తాళం వేసాను..

తన ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ..'కెరీర్‌ ఆరంభంలో ఫిట్‌నెస్‌, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండేది కాదు. గత కొన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఫిట్‌నెస్‌ నా దినచర్యలో భాగమైంది. ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తాను. తీపి పదార్థాలను, పాల ఉత్పత్తులను వీలైనంతగా తగ్గించాను. నా పొట్ట సామర్థ్యంలో 90 శాతం మాత్రమే తింటాను. భోజన ప్రియుడినైనా నేను ఇలా కొలతల ప్రకారం తినడం కష్టమైన పనే. అయితే అలా ఉండటం వల్ల శరీరంలో కలిగే సానుకూల మార్పులు గమనిస్తే.. ఆరోగ్యంగా ఉండటం ఓ వ్యసనంగా మారుతుంది. అందుకే డైట్‌, ఫిట్‌నెస్‌ విషయంలో నేను అంత కఠినంగా ఉంటాను'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 19, 2022, 8:15 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+