Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs NZ T20 WC: హార్దిక్ పాండ్యా ఫిట్.. శార్దూల్‌కు చాన్స్! టీమ్‌ కాంబినేషన్‌పై కోహ్లీ హింట్!

Virat Kohli says Shardul Thakur Is In Our Plans

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే టీమ్ కాంబినేషన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ హింట్ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో భుజగాయానికి గురైన హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్నాడని, అతను జట్టులో ఉంటాడని చెప్పాడు. అయితే అతను బౌలింగ్ వేసే విషయంపై మాత్రం విరాట్ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడని పరోక్షంగా తెలిపాడు. అతను తమ ప్రణాళికల్లో ఉన్నాడని చెప్పాడు. ఇక పాకిస్థాన్ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమితో టీమిండియాకు ఇది చావో రేవో మ్యాచ్‌లా మారింది. టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు న్యూజిలాండ్ సైతం పాకిస్థాన్ చేతిలో ఓడి భారత్ పరిస్థితినే ఎదుర్కొంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది.

శార్ధూల్‌తో టీమ్‌కు ప్లస్..

అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ టీమ్ ప్రణాళికలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను ఎలా గెలవాలనేదానిపై కసరత్తులు చేశాం. విజయానికి కావాల్సిన ప్రణాళికలను రచించాం. తుది జట్టు మార్పులపై ఇప్పుడే చెప్పలేను. జట్టులో సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఉండటం చాలా అవసరం. అది నేను అయినా హార్దిక్ పాండ్యా అయిన రెండు ఓవర్లు వేసినా జట్టుకు హెల్ప్ అవుతుంది. హార్దిక్‌ పాండ్యా విషయంలో మాకు క్లారిటీ ఉంది. అతను ఫిట్‌గానే ఉన్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో భుజగాయానికి గురైన అతను పూర్తిగా కోలుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ మా ప్రణాళికల్లో ఉన్నాడు. అయితే అతను ఏ ప్లేస్‌లో ఏ రోల్ పోషిస్తాడా? అనేది ఇప్పుడు నేను చెప్పలేను. అతనో అసాధారణమైన ఆటగాడు. శార్దూల్ వంటి ఆటగాడు జట్టులో ఉంటే కచ్చితంగా టీమ్‌కు హెల్ప్ అవుతుంది. 'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

జట్టుగా విఫలమయ్యాం..

జట్టుగా విఫలమయ్యాం..

ఇక భువనేశ్వర్ వైఫల్యంపై ప్రశ్నించగా.. ఆ మ్యాచ్‌లో టీమ్ మొత్తం విఫలమైందని, ప్రత్యర్థి జట్టు తమకన్నా మెరుగ్గా ఆడిందని చెప్పుకొచ్చాడు. 'పాకిస్థాన్ మ్యాచ్‌లో బౌలింగ్ గ్రూప్ మొత్తం విఫలమైంది. అయితే క్రీడల్లో ఇవి సహజమేనని మేం అర్థం చేసుకోగలం. ఈ బౌలర్లే గత కొన్నేళ్లు జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు. కాబట్టి మేం చేసిన తప్పిదాలేంటో తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. పాక్‌తో మ్యాచ్‌లో మేం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. ప్రొఫెషనల్ క్రికెట్ టీమ్‌గా ఎలాంటి ఈగో లేకుండా ఈ తప్పిదాలను అంగీకరించాల్సిందే. ఈ విషయంలో మేం ఎలాంటి సాకులు చెప్పడం లేదు. జట్టుగానే ఓడిపోయాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఎదురు దాడికి దిగడమే..

ఎదురు దాడికి దిగడమే..

లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో వికెట్లు పారేసుకున్న టీమిండియా.. కివీస్ స్వింగ్ కింగ్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించగా.. ధీటుగా బదులిస్తామని చెప్పాడు. షాహిన్ అఫ్రిది దెబ్బతో తమ తప్పిదాలు తెలుసుకున్నామని, బౌల్ట్‌ను ధీటుగా ఎదుర్కొని అతన్ని ఒత్తిడిలో పడేస్తామని చెప్పాడు. ఇతర బౌలర్లను కూడా అదే ప్రణాళికతో ఆడుతామని చెప్పాడు. అయితే ఇదంతా మైదానంలోని తమ మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందన్నాడు. అయితే కివీస్ బౌలర్లను చాలా రోజులుగా ఆడుతాన్నామని, కాబట్టి పెద్ద సమస్యేం ఉండదన్నాడు.

Story first published: Saturday, October 30, 2021, 21:13 [IST]
Other articles published on Oct 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+