Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో పంత్‌కే చాన్స్.. రహానే‌తో మంచి బంధం ఉంది: విరాట్ కోహ్లీ

 Virat Kohli says Rishabh Pant to continue in 1st Test after massive impact in Australia

చెన్నై: ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఫస్ట్ టెస్ట్‌‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కే అవకాశం ఇస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశాడు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన విరాట్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసీస్ పర్యటనకు దూరమైనా జట్టుతో టచ్‌లో ఉన్నానని తెలిపాడు.

 రిషభ్ పంత్‌కే అవకాశం..

రిషభ్ పంత్‌కే అవకాశం..

'తొలి టెస్టులో రిషభ్ పంత్‌కే అవకాశం ఇస్తున్నాం. అతనిప్పుడు హుషారుగా ఉన్నాడు. చక్కగా ఆడుతున్నాడు. అన్ని విధాలుగా తన ఆటను మెరుగు పర్చుకొనేందుకు కష్టపడుతున్నాడు. పంత్‌ ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడాడు. ఇక మీదటా అలాగే ఆడతాడన్న నమ్మకం అతని ఆటతీరు కలిగించింది. జట్టు అత్యంత సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌ చేయగల బౌలర్లపైనే దృష్టి పెడుతున్నాం' అని కోహ్లీ తెలిపాడు. సిడ్నీ టెస్టులో 97, బ్రిస్బేన్‌లో 89 నాటౌట్‌తో పంత్‌ దుమ్మురేపిన విషయం తెలిసిందే.

రహానెతో మంచి బంధం..

రహానెతో మంచి బంధం..

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో తనకు మంచి అనుబంధం ఉందని కోహ్లీ తెలిపాడు. తామిద్దరం పరస్పరం ఎంతో నమ్మకంగా ఉంటామని పేర్కొన్నాడు. 'నేను, జింక్సే కాదు జట్టులో అందరితో నాకు అనుబంధం ఎక్కువే. రహానే ఆస్ట్రేలియాలో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేశాడు. దేశం గర్వపడేలా జట్టును నడిపించాడు. అతను జట్టును విజయం వైపు నడిపించినందుకు సంతోషంగా ఉంది. అదే మా లక్ష్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇద్దరం కలిసే..

ఇద్దరం కలిసే..

'జింక్స్‌, నేను పరస్పరం మా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాం. మైదానంలో మేమెంతో గౌరవంగా ఉంటాం. మైదానం బయటా మా మధ్య మంచి రిలేషన్ ఉంది. బాగా మాట్లాడుకుంటాం. నిరంతరం అందుబాటులో ఉంటాం. మ్యాచులో అవసరమైనప్పుడు చక్కని సలహాలు ఇవ్వగల సామర్థ్యం అతనికుంది. మ్యాచు ఎటువైపు వెళ్తుందో మేమిద్దరం చర్చించుకుంటాం. జట్టు ప్రణాళికలపై నేనెప్పుడూ అతన్ని సంపద్రిస్తూనే ఉంటాను. అలా మేమిద్దరం కలిసి పనిచేస్తాం. టెస్టు క్రికెట్‌లో జట్టు విజయానికి కారణమిదే. జట్టును ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయంతో మేముంటాం' అని విరాట్‌ పేర్కొన్నాడు.

 ఆసుపత్రిలో ఆస్వాదించా..

ఆసుపత్రిలో ఆస్వాదించా..

ఆసీస్ పర్యటనలో గబ్బా వేదికగా గెలిచిన చారిత్రాత్మక విజయాన్ని ఆసుపత్రిలో ఆస్వాదించానని కోహ్లీ తెలిపాడు. 'వాస్తవానికి వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ అద్భుత బాగస్వామ్యాన్ని నేను నా ఫోన్‌లో చూశాను. ఆసమయంలో నేను ఆసుపత్రిలో ఉన్నాను. డాక్టర్ పిలిచే ముందు వరకు వారి ఆటను ఎంజాయ్ చేశాను. మా జట్టుకు దక్కిన గుర్తింపు వెనుక కొన్నేళ్ల కష్టం ఉంది. మేం ఎప్పుడూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. డ్రా అనేది చివరి అస్త్రం మాత్రమే. మ్యాచ్ మ్యాచ్‌కు పురోగతి సాధించాం. మా ఫలితాలు చూస్తే మేం ఎలా ఆడాలనేది అర్థమవుతుంది. నేను జట్టుతో లేకున్నా టచ్‌లో ఉంటా. ఆటకు అల్విదా ప్రకటించే వరకు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తూనే ఉంటా.'అని విరాట్ స్పష్టం చేశాడు.

Story first published: Thursday, February 4, 2021, 20:34 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+