Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శభాష్ పటీదార్.. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ నీదే: విరాట్ కోహ్లీ

Virat Kohli says Rajat Patidars Innings One of the best Ive ever seen in under pressure

కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన తమ టీమ్ యువ ప్లేయర్ రజత్ పటీదార్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు చూశానని, కానీ వాటన్నిటి కంటే పటీదార్ ఆడిన ఇన్నింగ్స్ ది బెస్ట్ అని తెలిపాడు. పటీదార్ ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, కీలక మ్యాచ్‌లో తన సత్తా ఏంటో తెలియజేశాడని కొనియాడాడు. పటీదార్ శతకానికి హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్ సూపర్ బౌలింగ్ తోడవడంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14 పరుగులతో గెలుపొందింది. దాంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగే క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ.. రజత్ పటీదార్‌ను ఇంటర్వ్యూ చేశాడు. సరదాగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో యువ ప్లేయర్‌ను విరాట్ ఆకాశానికెత్తాడు. 'గత కొన్నేళ్లుగా నేను ఎన్నో ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు చూశాను. కానీ ఈ రోజు రజత్ పటీదార్ ఆడిన ఇన్నింగ్స్ కంటే అవి గొప్పవి అనిపించడం లేదు. తీవ్ర ఒత్తిడిలో, ఎలిమినేటర్ వంటి బిగ్ మ్యాచ్‌లో ఓ అనామక క్రికెటర్ సెంచరీ కొట్టడం మాములు విషయం కాదు. చివరకు నేను కూడా ఈ మ్యాచ్‌లో టెన్షన్‌కు గురవడంతో పాటు నర్వస్ అయ్యా. కానీ పటీదార్ మాత్రం అద్భుతం. తీవ్ర ఒత్తిడిలో ఆడిన పటీదార్ ఇన్నింగ్స్.. నా కెరీర్‌లోనే నేను చూసిన అత్యుత్తమైనది. అతని స్ట్రైకింగ్ అద్భుతం. థ్యాంక్స్ బ్రదర్'అంటూ విరాట్.. పటీదార్‌ను ప్రశంసించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్‌లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు.

Story first published: Thursday, May 26, 2022, 13:43 [IST]
Other articles published on May 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+