న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీయస్‌ తీసుకోవడం లేదు.. ఇలా అయితే కష్టం : విరాట్ కోహ్లీ

Virat Kohli Says Noticing people not following Covid-19 lockdown guidelines
Virat Kohli Requests People To Follow 21-Day Lockdown Seriously

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధిస్తే ఏ ఒక్కరూ సిరీయస్‌గా తీసుకోవడంలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితి ఏంటో జనాలకు అర్థం కావడం లేదన్నాడు. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రతీ రోజు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కోహ్లీ.. తాజా పోస్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలను పాటించనవారిని హెచ్చరించాడు.

ఇలా అయితే కష్టం..

‘ఈ రోజు నేను ఓ ఇండియన్ ప్లేయర్‌గా మీతో మాట్లాడటం లేదు. ఓ బాధ్యతాయుతమైన పౌరునిగా చెబుతున్నా. కొన్ని రోజులుగా లాక్‌డౌన్ మార్గనిర్దేశకాలు, కర్ఫ్యూ నిబంధనలు పాటించకుండా ప్రజలంతా ఒక చోట గుమిగూడటాన్ని చూశాను. ఇది మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనం పోరాటం బలహీనంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్‌ను నిర్మూలించడానికి ఇలాంటి యుద్దం సరిపోదు.

మీ నిర్లక్ష్యం..

మీ నిర్లక్ష్యం..

ప్రతీ ఒక్కరూ నిబంధనలు అనుసరిస్తూ సామాజిక దూరాన్ని పాటించండి. అలాగే ప్రభుత్వ ఆదేశాలను గౌరవించండి. మీ నిర్లక్ష్యం మీతో పాటు మీ కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తుంది. నిపుణుల సూచనలను అనుసరించండి. వారు మనకోసం ఎంతో శ్రమిస్తున్నారు. నిబంధనలను పాటిస్తే కరోనాపై మనం విజయం సాధిస్తాం. లేకుంటే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. దయచేసి ఇంట్లోని ఉండండి. జైహింద్'అని హెచ్చరిస్తూ కోహ్లీ ఓ వీడియో ట్వీట్ చేశాడు.

మేల్కోండి.. సీరియస్‌నెస్‌‌ను తెలుసుకోండి..

మేల్కోండి.. సీరియస్‌నెస్‌‌ను తెలుసుకోండి..

దీనికి ‘దయచేసి మేల్కోండి. వాస్తవ పరిస్థితిని సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోండి. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. దేశానికి మన నిజాయితీ, మద్దతు అవసరం.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక క్రికెటర్లందరూ తమకు తోచిన సాయం చేస్తుండగా.. విరాట్ కోహ్లీ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి విరాళాలు ప్రకటించలేదు. ఇదే విషయాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అతను షేర్ చేసిన వీడియో కింద అన్ని కామెంట్స్ డొనేషన్స్ గురించే ఉన్నాయి.

Story first published: Friday, March 27, 2020, 20:52 [IST]
Other articles published on Mar 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X