Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు: విరాట్ కోహ్లీ

Virat Kohli says Not in a space where Ill go out and prove someone wrong

అహ్మదాబాద్: తన ఆట తీరుపై విమర్శలు గుప్పించిన వారిని తప్పు అని నిరూపించాల్సిన స్థితిలో తాను లేనని టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 186 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

మూడేళ్ల నిరీక్షణ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియగా.. 2-1 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 186 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. గత 10 ఏళ్లుగా ఆడినట్లు ఇటీవల కాలంలో ఆడలేకపోయానని తెలిపాడు.

గత 10 ఏళ్లుగా ఆడినట్లు..

గత 10 ఏళ్లుగా ఆడినట్లు..

'ఓ ఆటగాడిగా నాపై నాకున్న అంచనాలే నాకు ముఖ్యం. విమర్శకులు తప్పని నిరూపించాల్సిన స్థితిలో లేను. మైదానంలో ఉన్నందుకు తగిన న్యాయం చేయాలనుకున్నా. టెస్టు క్రికెట్లో గత పదేళ్లుగా ఆడినట్లు ఇటీవల కాలంలో ఆడలేకపోయా. తిరిగి ఆ ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తున్నా. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నాగ్‌పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌ నుంచి ఉత్తమంగానే బ్యాటింగ్‌ చేశాననుకుంటున్నా.

శ్రేయస్ అయ్యర్ దూరమవడంతో..

శ్రేయస్ అయ్యర్ దూరమవడంతో..

గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్‌ కొనసాగించాలనుకున్నా. ఓ బ్యాటర్ తక్కువయ్యాడనే ఉద్దేశంతో ఎక్కువ సేపు ఆడడంపై దృష్టి పెట్టాం. వీలైనంత సేపు జట్టు కోసం క్రీజులో ఉండాలనుకున్నాం. నేను ఆ పనే చేశా. కానీ గతంలో లాగా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయా. ఆ విధంగా చూస్తే నిరాశ కలుగుతోంది. కానీ ఉత్తమంగానే ఆడుతున్నాననే నమ్మకమూ వచ్చింది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

డ్రాకు అంగీకరించడంతో..

డ్రాకు అంగీకరించడంతో..

ఓవర్‌నైట్ స్కోరు 3/0‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా...175/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. భారత్‌పై 84 పరుగుల ఆధిక్యం సాధించింది. నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి ఔటవ్వగా.. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మార్నస్ లబుషేన్( 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

శతక్కొట్టిన కోహ్లీ, గిల్..

శతక్కొట్టిన కోహ్లీ, గిల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ( 186), శుభ్‌మన్ గిల్(128) సెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి డ్రా. కెరీర్‌లో 6 టెస్ట్‌ మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవి చూశాడు.

Story first published: Tuesday, March 14, 2023, 9:21 [IST]
Other articles published on Mar 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+