స్మిత్ భాయ్.. అందుకే నిన్ను తిట్టొద్దన్న: విరాట్ కోహ్లీ

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికొద్ది సేపట్లో ఫస్ట్ టెస్ట్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గురువారం సరదాగా చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా 2019 ప్రపంచకప్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటనను స్మిత్ గుర్తు చేశాడు. లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను కొందరు భారత అభిమానులు చీటర్ చీటర్ అంటూ తిట్టడం మొదలుపెట్టారు.ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ దాన్ని గమనించి వారిని వారించాడు. తిట్టడం ఆపి ఎంకరేజ్ చేయండంటూ చప్పట్లతో సైగ చేశాడు. దీనికి స్మిత్ కూడా మైదానంలోనే కోహ్లీకి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక మ్యాచ్ అనంతరం భారత అభిమానుల తరఫున స్మిత్‌కు విరాట్ క్షమాపణలు చెప్పాడు. అప్పట్లో ఈ సీన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. విరాట్ కోహ్లీ చూపించిన క్రీడా స్పూర్తిని ప్రతి ఒక్కరు కొనియాడారు.

తప్పులు సహజం బ్రో..
తాజాగా ఈ ఘటనను గుర్తు చేసుకున్న స్మిత్.. తనను తిట్టవద్దని ఎందుకు చెప్పావని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన విరాట్..‘ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నేను నమ్ముతాను. తప్పులు చేస్తాం.. వాటి నుంచి నేర్చుకుంటాం. ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మంచిది కాదని అప్పుడు నాకనిపించింది. అందుకే నిన్ను తిట్టొద్దని వారికి చెప్పాను. మనం ప్రత్యర్థులమైనప్పటికి.. ఓ మానవతాకోణం ఉంది. అందుకే ఈ రోజు ఇలా కలిసి మాట్లాడుకోగలుగుతున్నాం. ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం'' అని అన్నారు.

నవ భారత్‌కు ప్రతిరూపాన్ని..
సరికొత్త భారత్‌కు తాను ప్రతిరూపాన్నని విరాట్ కోహ్లీ ప్రకటించుకొన్నాడు. ఎటువంటి సవాల్‌నైనా సానుకూల దృక్పథంతో స్వీకరించడానికి తాను సిద్ధమని చెప్పాడు. ‘ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ కలిగిన నాన్ ఆస్ట్రేలియన్ విరాట్' అని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తరహాలో దూకుడు, పోరాడేతత్వం కోహ్లీలో ఉన్నాయని టీమిండియా మాజీ కోచ్‌గా పని చేసిన గ్రెగ్ విశ్లేషించాడు. దీనిపై బుధవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విరాట్ బదులిచ్చాడు.‘నేను నేనుగా ఉండాలనుకుంటున్నాన'ని కోహ్లీ చెప్పాడు. ‘నవీన భారత్‌కు నేను ప్రాతినిథ్యం వహిస్తున్నా. నా నడక, నడత కూడా ఆ విధంగానే ఉంటుంది. భారత జట్టు ఆటగాడిగా సగర్వంగా తలెత్తుకొని నిలవాలన్న భావన నుంచి ఇది మొదలైంది. కెరీర్ ఆరంభం నుంచే నా తీరు ఇంతే.'అని విరాట్ చెప్పుకొచ్చాడు. ప్రతీ చాలెంజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమన్నాడు.

ద్వేషం అనవసరం..
కరోనా కారణంగా అందరికీ వాస్తవాలు అర్థమై ప్రాధాన్యతలు మారిపోయాయనేది నా అభిప్రాయం. పాత తరహాలో వ్యక్తిగతంగా కొందరి పట్ల ద్వేషం చూపించడంలో అర్థం లేదని అంతా అనుకుంటున్నారు. ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిలో మార్పు రావడంతోపాటు ఐపీఎల్‌లో కలిసి ఆడటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఏదైనా అంతా ప్రొఫెషనల్‌గానే సాగుతుంది. పరుగులు సాధించడంలో, ప్రత్యర్థి వికెట్లు తీయడంలో దూకుడు లోటు ఏమీ ఉండదు కానీ అనవసరపు అంశాలు మాత్రం వడబోసి పక్కన పడేయడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మైదానంలో దిగి క్రికెట్ ఆడటమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇతర అంశాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అయితే క్రికెట్ నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడబోం. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనను మీరు చూస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications