న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిస్తే ఒక్కడు మాట్లాడలేదు.. విమర్శకులపై కోహ్లీ ఫైర్

Virat Kohli says No one said anything about pitch when we lost in New Zealand inside three days
India VS England: Always Too Much Noise About Spin-Friendly Tracks -Virat Kohli | Oneindia Telugu

అహ్మదాబాద్: గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిస్తే ఒక్కడు కూడా మాట్లాడలేదని, పిచ్ ప్రస్తావనే తీసుకురాలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కానీ స్పిన్ పిచ్‌లపై మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మొతెరా పిచ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు ఏ మాత్రం పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్ చేశారు. ఇరుజట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విరాట్.. పిచ్‌పై జరుగుతున్న చర్చపై స్పందించాడు.

గెలవడం కోసమా..?

గెలవడం కోసమా..?

'మీ అందిర్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా.. గెలవడం కోసం మ్యాచ్ ఆడుతామా? లేక ఐదు రోజుల ఆట కొనసాగాలని ఆడుతామా? న్యూజిలాండ్‌ చేతిలో మేం ఓడిన రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిసాయి. అప్పుడు ఏ ఒక్కరు కూడా పిచ్ గురించి మాట్లాడలేదు. అప్పుడంతా బ్యాట్స్‌మన్ నైపుణ్యంపైనే చర్చించారు. కానీ పిచ్ గురించి కాదు. టెస్ట్ క్రికెట్ స్పిన్ ట్రాక్‌లను ఎదుర్కోవడం కూడా కీలకమనే విషయాన్ని అందరికి తెలియజేయాలి. ఎప్పుడైనా ఆటలో మన బలాలపైనే దృష్టిసారించాలి. కానీ పిచ్‌పై కాదు.

స్పిన్ కూడా ముఖ్యమే..

స్పిన్ కూడా ముఖ్యమే..

స్పిన్ ట్రాక్‌లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉపఖండంలో స్పిన్నింగ్ ట్రాక్స్ బాగున్నాయనే అభిప్రాయాన్ని మన మీడియా కలగజేయాలి. ఒక జట్టుగా మా విజయానికి కారణం ఏంటంటే.. మేం ఓడినా ఏనాడు పిచ్‌లను నిందించింది లేదు. ఆటపరంగా మెరుగవ్వడానికి ప్రయత్నించాం. బంతి, పిచ్‌పై అందరూ ఎందుకంత దృష్టి పెట్టారో అర్థం కావడం లేదు. మూడో టెస్ట్‌లో పిచ్‌ను టాకిల్ చేసే విషయంలో ఇరు జట్ల బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. పిచ్ బాలేదనడం కంటే బ్యాట్స్‌మన్ స్కిల్ సరిపోలేదనేది నా అభిప్రాయం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ భారత్ 0-2తో క్లీన్ స్వీప్‌కు గురైంది. కివీస్ పేస్ ధాటికి భారత బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

పిచ్‌‌‌‌పై సస్పెన్స్‌‌

పిచ్‌‌‌‌పై సస్పెన్స్‌‌

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగానే గురువారం నుంచి ప్రారంభం కానుంది. స్పిన్‌‌‌‌ వికెట్లతో వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఇంగ్లండ్‌‌‌‌ను చిత్తు చేసిన టీమిండియా ఆఖరి టెస్టు కోసం ఎలాంటి పిచ్‌‌‌‌ను ఎంచుకుంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్‌‌‌‌ ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌ రెడీ చేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు లీక్స్‌‌‌‌ ఇచ్చాయి. ప్రస్తుతానికైతే లాస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు వాడే పిచ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌తో నిండి ఉంది. మ్యాచ్‌‌‌‌ మొదలయ్యే లోపు గ్రాస్‌‌‌‌ను ఎంత మేర తొలగిస్తారో చూడాలి. రోహిత్‌‌‌‌, రహానె తదితరులు మాత్రం ఇండియా అంటేనే స్పిన్‌‌‌‌ వికెట్ల అని ఇప్పటికీ అంటున్నారు. ఈ లెక్కన ఆఖరాటకూ ఇండియా స్పిన్‌‌‌‌ వికెట్‌‌‌‌నే ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో గురువారం వరకూ ఈ సస్పెన్స్‌‌‌‌ కొనసాగనుంది.

Story first published: Wednesday, March 3, 2021, 15:49 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X