For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

348 మస్త్ అనుకున్నాం.. కానీ ఆ ఇద్దరు మా గెలుపును లాగేశారు : కోహ్లీ

Virat Kohli Says New Zealand deserved to win

హమిల్టన్: టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం చుక్కెదురైంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న కోహ్లీసేనకు తొలి వన్డేలోనే కివీస్ కళ్లెం వేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా.. అలవోకగా చేధించి తమ సత్తా ఏంటో భారత్‌కు చూపించింది.

అయితే 348 పరుగుల భారీ లక్ష్యం సరిపోతుందనుకున్నామని, కానీ న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన కివీస్ ప్లేయర్లు ఈ విజయానికి అర్హులని కొనియాడాడు.

'ఇది న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన. వారు అత్యుద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 348 పరుగుల లక్ష్యం మేం సరిపోతుందనుకున్నాం. కానీ అనుభవం కలిగిన రాస్ టేలర్, టామ్ లాథమ్ మా విజయ అవకాశాలను దెబ్బతీశారు. ఈ గెలుపు క్రెడిట్ టామ్, టేలర్‌దే. మాకు ఒక్క అవకాశం లభించలేదు. కానీ బాగా పోరాడాం. ఇంకా మేం ఏదో మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాకన్నా మా ప్రత్యర్థి బాగా ఆడింది. ఈ విజయానికి వారు అర్హులు. ఇక ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన మయాంక్, పృథ్వీ షా అద్భుత ఆరంభాన్నిచ్చారు. మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇలానే ఆడుతారని భావిస్తున్నా. ఒత్తిడిని జయించి తొలి సెంచరీ సాధించిన అయ్యర్ సూపర్. కేఎల్ మరోసారి రాణించడం అత్యద్భుతం. ఇవన్నీ మాకు సానుకూల అంశాలే.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 4 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం 348 పరుగులతో దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

Story first published: Wednesday, February 5, 2020, 17:48 [IST]
Other articles published on Feb 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+