భారత్‌కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం.. దానికోసం ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియాకు ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని, దాని కోసం ఎంతకైనా తెగిస్తానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లీ.. ప్రపంచకప్‌లు మాత్రం గెలవలేకపోయాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేదనే అప్రతిష్టను తుడిచి పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన కోహ్లీ చివరకు విఫలమయ్యాడు.
కోహ్లీ సారథ్యంలోని భారత్ 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2020 ఫైనల్లో కివీస్ చేతిలోనే పరాజయం పాలైంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. కెప్టెన్‌గా ఐసీసీ టైటిళ్లు గెలవకపోవడంతో కోహ్లీ సారథ్యం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
కనీసం ఆటగాడిగానైనా..
దాంతో చివరకు ఆటగాడిగానైనా మరోసారి ఐసీసీ టైటిల్ గెలవాలని కోహ్లీ భావిస్తున్నాడు. యువ ఆటగాడిగా 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన విరాట్.. 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనలోనూ చెత్త ప్రదర్శనను కనబర్చాడు. ఈ క్రమంలో విండీస్ పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ మళ్లీ జింబాబ్వే పర్యటనతో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆ తర్వాత ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ఆడనున్నాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో..
యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ సిరీస్ అధికార బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఓ వీడియోను రిలీజ్ చేసిన స్టార్ స్పోర్ట్స్.. తాజాగా ఈ టోర్నీని ఉద్దేశించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో పంచుకుంది. 'నా ప్రధాన లక్ష్యం భారత్‌కు ఆసియా కప్‌తో పాటు ప్రపంచకప్ అందించడం. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం.'అని కోహ్లీ అన్న వ్యాఖ్యలను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఆసియా కప్ చివరి చాన్స్..
ఐపీఎల్ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన మూడు ఫార్మాట్లలో ఆడాడు. కానీ ఒక టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డేలలో కలిపి మొత్తంగా 80 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో అతను విశ్రాంతి తీసుకోవాలని కొందరు.. అవసరం లేదు ఆడాలని మరికొందరు ఎవరికి నచ్చిన అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే కోహ్లీ మాత్రం విండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి యూకే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత ప్రారంభం కాబోయే జింబాబ్వే టూర్‌కు కోహ్లీని పంపించాలని బీసీసీఐ యోచిస్తుంది. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌తో అతని భవితవ్యం తేలనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications