Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో నా రోల్ అదే.. అందుకే అలా ఆడా: విరాట్ కోహ్లీ

 Virat Kohli says my job is stabilize the innings and build a partnership

దుబాయ్: పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడమే జట్టులో తన బాధ్యతని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు నిదానంగా ఆడాల్సి ఉంటుందని, మరికొన్ని సార్లు ధాటిగా ఆడాల్సి వస్తుందన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ 2022తో మళ్లీ జట్టులోకి వచ్చిన కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

పాకిస్థాన్‌తో 35 పరుగులు చేసిన విరాట్.. హాంగ్ కాంగ్‌తో అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై సహచర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భాగస్వామ్యాలు నెలకొల్పడమే..

భాగస్వామ్యాలు నెలకొల్పడమే..

'పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడం.. క్రీజులో ఉన్న సహచర ఆటగాళ్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం జట్టులో నా బాధ్యత. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నేను బౌండరీలు కొట్టేందుకు రిస్క్ తీసుకుంటాను. నేను లాంగ్ బ్రేక్ తీసుకొని వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఆరు వారాల విరామం తీసుకోవడం ఇదే తొలిసారి. నేను చాలా ఫ్రెష్‌గా ఈ టోర్నీకి వచ్చాను. బలమైన బౌలింగ్ విభాగం ఉన్న పాకిస్థాన్‌తో కూడా నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. హాంగ్ కాంగ్‌తో కూడా అదే జోరును కొనసాగించాను.

సూర్య రాకతో..

సూర్య రాకతో..

నువ్వు(సూర్య) వచ్చిన తర్వాత ధాటిగా ఆడాలనుకున్నాను. నీకు కూడా అదే విషయం చెప్పా. కానీ నీ ఆటతో నువ్వు నాకు స్పష్టమైన సూచన చేశారు. నేను చూసుకుంటాను.. మీరు నిదానంగా ఆడండని చెప్పకనే చెప్పావు. దాంతో నేను నా ఆలోచనను మార్చుకొని యాంకర్ రోల్ పోషించాల్సి వచ్చింది. నువ్వు ప్రతీ బంతిని బాదిన విధానం నన్ను ఆకట్టుకుంది. నేను కూడా క్రీజులో సెట్ అయిన తర్వాత అలానే ఆడాలనుకున్నా. ఒకవేళ నువ్వు అలా ఆడకపోయుంటే నేను ఆ బాధ్యత తీసుకునేవాడిని. ఇద్దరం విఫలమైనా రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, జడేజాలు వచ్చి చెలరేగేవారు.'అని కోహ్లీ తెలిపాడు.

రికార్డులు అనవసరం..

రికార్డులు అనవసరం..

ఇక వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్లను తాను అస్సలు పట్టించుకోనని, జట్టు విజయానికి కావాల్సినదానిపైన మాత్రమే ఫోకస్ పెడతానన్నాడు. 'గత కొన్నేళ్లుగా నా ఆట ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని అమలు చేయడంపైనే నా ఫోకస్ ఉంటుంది. టీమ్‌కు ప్రయోజనం కలిగేలా ఆడటానికే ఇష్టపడుతా. గత రెండు మ్యాచ్‌ల్లో నేను బాగా ఆడాను. వ్యక్తిగత రికార్డులు, పరుగులను పెద్దగా పట్టించుకోను. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నానా? లేదా? అనేదే నాకు ముఖ్యం'అని కోహ్లీ తెలిపాడు.

చెలరేగిన సూర్య, కోహ్లీ..

చెలరేగిన సూర్య, కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్(26), రాహుల్(36) పర్వాలేదనిపించారు. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్‌తో లయ తప్పింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, September 1, 2022, 17:06 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+