Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను టీ20లకు పనికిరానన్నారు: విరాట్ కోహ్లీ

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో శతకాన్ని అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలోనే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్‌ గేల్(6) రికార్డును కోహ్లీ అధిగమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన కోహ్లీ.. వరుసగా రెండో శతకాన్ని అందుకున్నాడు.

Virat Kohli says Lot of people thinking my T20 cricket is decline

ఈ సెంచరీ అనంతరం మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది టీ20ల్లో తన పనైపోయిందని మాట్లాడరని గుర్తు చేసుకున్నాడు. 'చాలా మంది టీ20 క్రికెట్‌లో నా పని అయిపోందన్నారు. నేను మళ్లీ అత్యుత్తమ టీ20 క్రికెట్ ఆడుతున్నానని అనుకుంటున్నా. నా ఆటను నేను ఆస్వాదిస్తున్నా. నా టీ20 ఆట ఇలానే ఉంటుంది.

గ్యాప్ చూసుకొని షాట్ ఆడుతా. ఎక్కువగా బౌండరీలు బాదుతూ.. పరిస్థితులకు తగ్గట్లు చివర్లో భారీ షాట్లకు ప్రయత్నిస్తా. ఏ ఫార్మాట్‌లోనైనా పరిస్థితులకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం. ప్రస్తుతం నా గేమ్, బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. స్పిన్ బౌలింగ్‌ను ఆడటం అంత సులువైన పనికాదు. ఈ మ్యాచ్‌లో వర్షం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. జట్టు కోసం నేను ఏం చేయగలనో అదే చేశాను.

ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అనూజ్ రావత్‌తో కలిసి పోరాడాలనుకున్నా. 190 పరుగులు చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నాం. కానీ 200కు సమీపంగా పరుగులు చేశాం. ఇక్కడ ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఇన్ని పరుగులు అధిగమించలేదు. 'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ( 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్) శతక్కొట్టాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. కోహ్లీకి తోడుగా అనూజ్ రావత్(15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 21, 2023, 23:00 [IST]
Other articles published on May 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+