Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ విజేత.. అతడే మా ఓపెనర్‌: కోహ్లీ

Virat Kohli says KL Rahul is a champion player, He will continue to open for Team India in T20Is
Ind vs Eng 3rd T20I : KL Rahul Is A Champion Player And He Will Continue To Open - Virat Kohli

అహ్మదాబాద్‌: మొతేరా మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో విఫలమవుతున్న ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అండగా నిలిచాడు. ‌రాహుల్‌ మ్యాచ్‌ విజేతని కోహ్లీ చెప్పాడు. టీ20 ఫార్మాట్‌లో సీనియర్ ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే సరైనోడు అని స్పష్టం చేశాడు. మ్యాచ్‌ విజయానికి ఉపయోగపడని ఇన్నింగ్స్‌లు వృథాయేనని కోహ్లీ అంటున్నాడు. మూడో టీ20లో విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. బౌలర్లు సత్తాచాటకపోవడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడింది.

రాహులే సరైనోడు

రాహులే సరైనోడు

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'రెండ్రోజుల క్రితం వరకు నేనూ ఫామ్‌లో లేను. కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్ విజేత. జట్టులో అతడో కీలక ఆటగాడు. రోహిత్ శర్మ‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. టీ20 ఫార్మాట్‌లో ఫామ్‌లోకి రావడమనేది ఐదారు బంతుల వ్యవహారమే. ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే సరైనోడు' అని కోహ్లీ స్పష్టం చేశాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన రాహుల్‌ నేరుగా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. మధ్యలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. ప్రస్తుత టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో 1, 0, 0కు వెనుదిరిగాడు.

ఆ ఇన్నింగ్స్‌తో ప్రయోజనం లేదు

ఆ ఇన్నింగ్స్‌తో ప్రయోజనం లేదు

మ్యాచ్‌ విజయానికి ఉపయోగపడని ఇన్నింగ్స్‌లు వృథాయేనని విరాట్ కోహ్లీ అంటున్నాడు. 'జట్టు విజయాలకు ఉపయోగపడని ఇన్నింగ్స్‌తో ప్రయోజనం లేదు. కొత్త బంతితో బ్యాటింగ్‌ చేయడం కష్టమే. ఇంగ్లండ్ బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేశారు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను పాటించారు. అదనపు వేగం కూడా తోడైంది. చిన్నదే అయినా మాకు మంచి భాగస్వామ్యం లభించింది.

చివరి వరకు బ్యాటింగ్‌ చేసేందుకు నాకది ఉపయోగపడింది. క్రీజులో నిలదొక్కుకొని మంచి లక్ష్యం నిర్దేశించాలన్నదే నా ఉద్దేశం. రెండో అర్ధ భాగంలో మా తీవ్రత తగ్గింది. హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ సత్తా తెలిసిందే. అయితే బంతితో కూడా మరికాస్త బాధ్యత తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం' అని కోహ్లీ చెప్పాడు.

డకౌటవడం ఇది రెండోసారి

డకౌటవడం ఇది రెండోసారి

ఈ టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్ డకౌటవడం ఇది రెండోసారి. మూడు మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేయడం గమనార్హం. తొలి టీ20లో 4 బంతులాడిన రాహుల్.. ఒక పరుగు మాత్రమే చేసి జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు. ఆ తర్వాత రెండో టీ20లో సామ్ కరన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో టీ20లో ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు.

వేటు వేయాలని డిమాండ్:

వేటు వేయాలని డిమాండ్:

మూడో టీ20లోనూ కేఎల్ రాహుల్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌కి చేరడంతో.. అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అతడికి బదులుగా శిఖర్ ధావన్ ఆడితే బాగుంటుందని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి తొలి రెండు టీ20ల్లో రాహుల్ నిరాశపరిచిన తర్వాత మూడో టీ20కి అతనిపై వేటు వేయాలని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు డిమాండ్ చేశారు. కానీ తడికి మరో అవకాశాన్ని కోహ్లీ ఇచ్చాడు. అయితే ఈ ఛాన్స్‌ని కూడా రాహుల్ ఉపయోగించుకోలేదు.

Sarah Taylor: పురుషుల క్రికెట్లో మహిళా కోచ్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!!

Story first published: Wednesday, March 17, 2021, 12:19 [IST]
Other articles published on Mar 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+