Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sarah Taylor: పురుషుల క్రికెట్లో మహిళా కోచ్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!!

Sarah Taylor appointed Sussex Wicketkeeping Coach

లండన్‌: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ అరుదైన ఘనత సాధించారు. తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా సారా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సమకాలీన క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా సారా పేరు పొందిన విషయం తెలిసిందే. సారా టేలర్‌ 2019లో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

కోచ్‌గా ఎంపికయిన సందర్భంగా సారా టేలర్‌ మాట్లాడుతూ... 'ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్‌ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఎక్కువ సంక్లిష్టం చేయకుండా తేలిగ్గా పనిచేయడం నా అలవాటు' అని అన్నారు.

క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న దశలో సారా టేలర్‌ ఆటకు వీడ్కోలు పలికారు. మానసిక ఆరోగ్య సమస్యలతో 30 ఏళ్లకే సారా ఆటకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈస్ట్‌బౌర్న్‌లోని ఓ పాఠశాలలో క్రీడలు, లైఫ్‌ కోచ్‌గా పనిచేశారు. ససెక్స్‌ మెంటల్‌ హెల్త్‌, వెల్‌బీయింగ్‌ హబ్‌ను నెలకొల్పేందుకు కృషి చేశారు. అయితే ఆమె మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదని గతంలో ఓసారి అన్నారు.

ఇంగ్లండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్‌ 2019లో ఆటకు వీడ్కోలు పలికారు. సుదీర్ఘ ఫార్మాట్లో 300, వన్డేల్లో 4056, టీ20ల్లో 2177 పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్‌, 128 క్యాచులు అందుకున్నారు. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ గెలవడంతో సారా కీలక పాత్ర పోషించారు. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్‌ను సారా ఆదుకున్నారు.

Story first published: Wednesday, March 17, 2021, 11:25 [IST]
Other articles published on Mar 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+