టెస్ట్ ఫార్మాటే అసలు సిసలు క్రికెట్.. 100 మ్యాచ్‌లు ఆడుతానని అనుకోలేదు: విరాట్ కోహ్లీ

మొహాలి: తన కెరీర్‌లో 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతానని అస్సలు ఊహించలేదని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆ దేవుడి దయ, ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నేను పడ్డ శ్రమే తనను ఈ ఘనతను అందుకునేలా చేసిందన్నాడు. శ్రీలంకతో రేపటి( శుక్రవారం) నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ విరాట్ కెరీర్‌లో 100వది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌పై బీసీసీఐ టీవీతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ వీడియో బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
స్పెషల్ మూమెంట్..
'కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతుండటం ప్రత్యేక మూమెంట్. నిజానికి ఈ ఘనతను అందుకుంటానని కలలో కూడా అనుకలేదు. ఆ దేవుడి దయతో పాటు ఫిటెనెస్ కాపాడుకోవడానికి నేను పడ్డ శ్రమ ఈ మైలురాయిని అందుకునేలా చేసింది. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడటంపై చాలా గొప్పగా ఫీలవుతున్నా. నాతో పాటు నా కుటుంబానికి, కోచ్‌కు ఇదో గొప్ప సందర్భం. వాళ్లంతా గర్వపడే విషయం. వాస్తవానికి ప్రతీ మ్యాచ్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనేదే నా ఆలోచన. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సెషన్ బై సెషన్ బ్యాటింగ్ చేయడమంటే నాకు మజా.

ఎక్కువ సేపు ఆడటాన్ని ఆస్వాదిస్తా..
అలా ఆడినప్పుడే ఓ క్రికెటర్ అసలు సిసలు సత్తా తెలుస్తుందనే నా ఫీలింగ్. దాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచే నేను పెద్ద స్కోర్లు చేయాలనుకునేవాడిని. ఏనాడు కూడా చిన్న స్కోర్ల గురించి ఆలోచించలేదు. ఆ ఆలోచనే నన్ను ఎక్కువ పరుగులు చేసేలా ఉసిగొల్పింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి రాకముందే జూనియర్ క్రికెట్‌లోనే నేను 7-8 డబుల్ సెంచరీలు బాదాను. టెస్ట్ క్రికెట్ సజీవంగా ఉండాలి. ప్రజలంతా టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజాను తెలుసుకోవాలి. నా దృష్టిలో టెస్ట్ క్రికెటే అసలు సిసలు క్రికెట్.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ధోనీ వారసత్వం..
2014లో ఎంఎస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ జట్టును విజయపథంలో నడిపించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్లలో అత్యధిక విజయాలు అందుకున్న నాయకుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వారి సొంతగడ్డపై మట్టికరిపించి సిరీస్‌లు గెలిచి కెప్టెన్‌గా.. ఆటగాడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆటగాడిగానూ కోహ్లీ ప్రదర్శన అద్భుతమనే చెప్పొచ్చు. ఇప్పటివరకు 99 టెస్టుల్లో 7962 పరుగులు సాధించాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి.
ఇక కోహ్లి టీమిండియా తరపున వందో టెస్టు ఆడుతున్న 12వ ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్ తదితరుల సరసన నిలవనున్నాడు. ఇక మరో 38 పరుగులు చేస్తే 8వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలవనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications