
శార్దూల్‌కు బదులు బౌలరే..
'తొలి టెస్టులో జడేజా పరుగులు చేయడం సంతోషకరం. ఇది రెండో టెస్టుకు అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దాంతో టీమిండియా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుంది. లోయర్ ఆర్డర్ పరుగుల భాగస్వామ్యమూ ముఖ్యమే. ఇలాంటి కండిషన్స్‌లో శార్దూల్ బ్యాటింగ్ సామర్థ్యం ఉపయోగపడేదే.
అయితే పుజారా, రహానె, నాతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. తొలి టెస్టులో మేం పరుగులు చేయనిమాట నిజమే. ఇతర బ్యాట్స్‌మెన్ ముందుకొచ్చేందుకు ప్రతి మ్యాచ్ ఒక అవకాశంగా మారుతుంది. రోహిత్, కేఎల్ రాహుల్ బాగా ఆడారు. అందుకే ఒక బ్యాటింగ్ విభాగంగా మేం బలంగా ఉన్నాం. శార్దూల్ లేనంత మాత్రాన ఒక బ్యాట్స్‌మన్ తక్కువైనట్టేమీ కాదు. జట్టుకు సమతూకం తీసుకురావడమే మాకు ముఖ్యం. శార్దూల్ లేనప్పుడు మేం 20 వికెట్లు తీసేందుకు తోడ్పడే మరొకరిని చూడాలి. అతను బ్యాటుతోనూ పరుగులు చేస్తే బాగుంటుంది.

ఆందోళన లేదు..
పుజారా, రహానెపై మేం ఆందోళన చెందడం లేదు. వ్యక్తిగత ప్రదర్శన కాకుండా జట్టుకు వారెలా ఉపయోగపడుతున్నారనేదే ముఖ్యం. మాది అత్యుత్తమమైన బ్యాటింగ్ లైనప్. ఇది అసలు ఆలోచించాల్సిన విషయమే కాదని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ ఉన్నారు అని ఆలోచించట్లేదు. జట్టుగా ఎంత దృఢంగా ఉన్నాము అన్నదే ఇప్పుడు మాకు ముఖ్యం. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసి జట్టుకు ఉపయోగపడాలని మేము చూస్తున్నాం. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ బాధ్యత తీసుకోవాలి.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

పంత్ తీరు అంతే..
'తొలి ఇన్నింగ్స్‌లో 20బంతుల్లో 25 పరుగులు చేసి దూకుడు మీద కనపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో అతనిపైనా విమర్శలు పెరిగాయి. కానీ పంత్‌ను విరాట్ వెనకేసుకొచ్చాడు. పంత్ శైలి అలాగే ఉంటుందని.. అతను అలాగే ఆడాలని అభిప్రాయపడ్డాడు. 'పంత్ అలాగే ఆడతాడు. అతని శైలి కూడా అదే. ఆట రూపురేఖలను మార్చే విధంగా పంత్ ఇన్నింగ్స్ ఉండాలని టీమ్ ఆశిస్తోంది. అతను అలా ఆడితే మ్యాచ్ మావైపు తిరుగుతుంది. పంత్ అలాగే ఆడాలి.
ఆడతాడు కూడా. భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా అతనికి ఉంది. పరిస్థితికి తగ్గట్టు ఎలా ఆడాలో ఆర్థం చేసుకునే తెలివి పంత్‌కు ఉంది. పరిస్థితులు బాగా లేనప్పుడు చెత్త షాట్లు ఆడొద్దని అతనికి తెలుసు. అదే 50-50 అవకాశం ఉంటే అతడు చెలరేగడమే మంచిది. అతడికి జట్టు యాజమాన్యం స్పష్టమైన బాధ్యతలు అప్పగించింది' అని విరాట్ వెల్లడించాడు.

కోహ్లీ డకౌట్..
కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం నిలకడలేమి ఫామ్‌తో బాధపడుతున్నాడు. గత రెండేళ్లుగా సెంచరీ సాధించింది లేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు బాదినా అవి అతని స్థాయికి తగినవి కావు. ఈ పరిస్థితుల్లో ఎన్నో అంచనాల మధ్య భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగిన కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఫస్ట్ టెస్ట్‌లో తొలి బంతికే ఔటై గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగాడు. అతని వైఫల్యం టీమ్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. విరాట్ తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులతో పాటు జట్టు కూడా ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications












