ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌కు చేర్చినా.. ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నారు: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో భారత్ జట్టును నాకౌట్‌కు చేర్చినా తనను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గా చూశారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వరుసగా ఐదు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన ఘనతను అందుకున్నా.. తనను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్ అని విమర్శించారని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాడు. తాజాగా ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విరాట్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కెరీర్‌లో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే తనకు అండగా నిలిచాడని మరోసారి చెప్పుకొచ్చాడు.

ధోనీ ఒక్కడే..
'నా కెరీర్‌లో ఇప్పటికే భిన్నమైన దశలను ఎదుర్కొన్నాను. ఐపీఎల్ 2022 సమయంలో నేను విషమ దశను అనుభవించాను. ఆ సమయంలో ధోనీ ఒక్కడే నాకు అండగా నిలిచాడు. ధోనీ స్వచ్చమైన ప్రేమ, అతనితో అనుబంధం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ధోనీ నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ధోనీని కలవాలంటే చాలా కష్టం.
అతని దగ్గరికి వెళ్లాల్సిందే. ధోనీకి కాల్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు, ఎందుకంటే ఫోన్‌ను అతను ఎక్కువగా చూడడు. దాన్ని అస్సలు పట్టించుకోడు. గతేడాది ధోనీ నాకు పంపిన మెసేజ్ ఎప్పటికీ మరిచిపోలేను. నేనేం చెప్పకపోయినా నేను ఏ స్థితిలో ఉన్నానో.. ఎలాంటి మానసిక సమస్యలతో అనుభవిస్తున్నానో ధోనీ అర్థం చేసుకున్నాడు.

నన్ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసిందే..
'నువ్వు ఎప్పుడైతే బలంగా ఉండాలని అనుకుంటావో అప్పుడు నిన్ను నీవు దృఢమైన వ్యక్తిగా చూడు. అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నువ్వు ఎలా ఉన్నావని అడగడం కూడా మరిచిపోతారు'అని సందేశం పంపించాడు. ధోనీ పంపిన ఆ మెసేజ్, ఆ మాటలు, నాకు నా ఇంట్లోవాళ్లు చెప్పినట్టే అనిపించాయి. అతను చాలా బలమైన వ్యక్తి.
మానసికంగా కూడా దృడమైనవాడు.ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ డీల్ చేయగల సమర్థుడు. ధోనీనే నన్ను కెప్టెన్‌గా ప్రమోట్ చేశాడు. ఎందుకంటే అతని సారథ్యంలో నేను ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాను. అతనికి డిప్యూటీగా చాలా కాలం పని చేసిన నేను అతనిలా గేమ్ అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. దాంతో నాకు సారథ్యం వహించే సామర్థ్యం ఉందనే నమ్మకం ధోనీకి కలిగింది.

అక్కడే నా కెరీర్ మలుపు తిరిగింది..
ధోనీ అంటే నాకు చాలా గౌరవం. మా ఇద్దరి మధ్య నమ్మకం, స్పష్టత చాలా ఎక్కువ. అందుకే మాహీతో నేను ఏ విషయాన్నైనా పంచుకోగలను. ధోనీ కెప్టెన్సీలో కానీ.. నా కెప్టెన్సీలో కానీ మేం ఇద్దరం అసౌకర్యానికి గురైన సందర్భం లేదు. కెప్టెన్‌గా జట్టులో సంస్కృతిక మార్పులు చేయడం గర్వించదగిన విషయం.
టోర్నీలు నిర్దిష్ట సమయానికి ముగిసినా.. జట్టులోని సంస్కృతి ఎప్పటికీ ఉంటుంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌తో నా కెరీర్ మలుపు తిరిగింది.

ఆ క్షణం భావోద్వేగానికి గురయ్యాం..
2018 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు 2014 నాటి ఘటనలు గుర్తుకొచ్చాయి. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు అభిమానులు నాపై విమర్శలు గుప్పించారు. ఆ ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసిన తర్వాత డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ఆ ఇన్నింగ్స్‌తో నేను, అనుష్క భావోద్వేగానికి గురవ్వడంతో పాటు సంతోషానికి గురయ్యాం. ఇక మా నాన్న అకాల మరణం నా కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టే ప్రేరణ ఇచ్చింది. ఆయన కలను నెరవేర్చాలనే కసి పెరిగింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications