Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ ఆటగాళ్ల గొడవతోనే ఆ ఐకానిక్ ఇన్నింగ్స్ ఆడాను: విరాట్ కోహ్లీ! (వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. కూతురి బర్త్‌డే కోసం అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20కి దూరంగా ఉన్న కోహ్లీ.. ఆదివారం ఇండోర్ వేదికగా జరిగే రెండో టీ20తో పొట్టి ఫార్మాట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన కోహ్లీ.. తన రీఎంట్రీ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

టీ20 క్రికెట్ ఆడే సమయంలో తన అలవాట్లు ఏంటో చెప్పిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై ఆడిన ఐకానిక్ నాక్ (82 నాటౌట్)ను గుర్తు చేసుకున్నాడు. మైదానంలో పాకిస్థాన్ ఆటగాళ్లు గొడవను క్యాష్ చేసుకొని ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడినట్లు చెప్పుకొచ్చాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్ అనంతరం తనకు ఎన్నో మెసేజ్‌లు వచ్చాయని తెలిపాడు.

 Virat Kohli says I take an afternoon nap on his T20 routine

టీ20 క్రికెట్ ఆడే సమయంలో మధ్యాహ్నం ఓ కునుకు తీయడం తనకు అలవాటని కోహ్లీ పేర్కొన్నాడు. 'నేను ఉదయం 7.30 లేదా 8 గంటలకు నిద్ర లేస్తాను. సొంతంగా కాఫీ చేసుకోవడంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. ప్రతీ మ్యాచ్‌కు ముందు నేను చేసేది ఇదే. ఆ తర్వాత జిమ్‌కు వెళ్లి సాధారణ ఎక్స్‌ర్‌సైజ్‌లు, స్ట్రెచెస్, స్టఫ్ ఉన్నవి చేస్తాను. టీ20 మ్యాచ్‌లు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఓ కునుకు తీస్తాను.'అని కోహ్లీ తన అలవాట్ల గురించి చెప్పుకొచ్చాడు.

ఇక పాకిస్థాన్‌పై ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కోహ్లీ వరల్డ్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

'మా జట్టు ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోతుందని నేను ఊహించలేదు. అక్షర్ పటేల్‌ను నేను క్షమాపణలు కోరాను. నా వల్లే అతను రనౌటయ్యాడు. ఈ వికెట్‌తో మా పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి బ్యాటింగ్ లైనప్ ఏంటో చూడటం సర్వసాధారణం. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాం. నేను 21 బంతుల్లో 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాను. ఇది మరీ దారుణంగా అనిపించింది.

క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో ముందు మనం మంచి భాగస్వామ్యం నెలకొల్పుదామని చెప్పాను. అప్పుడే మైదానంలో పాక్ ఆటగాళ్లు గొడవపడటం చూశాను. ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవాలని భావించాను. అదృష్టవశాత్తు అప్పుడే మాకు బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫోర్లు వచ్చాయి. దాంతో మా ఇన్నింగ్స్ ట్రాక్‌లోకి వచ్చింది.

ఈ మ్యాచ్ గెలవాలంటే హ్యారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో 20 పరుగులు చేయాలి. వాస్తవానికి అప్పటి వరకు అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఖచ్చితమైన యార్కర్లతో పాటు బౌన్సర్లను సంధిస్తున్నాడు. మనం 20 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది అంత సులువు కాదని అతని బౌలింగ్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడే నాకు నేను ఎంకరేజ్ చేసుకున్నా. కమాన్ చీక్స్.. నువ్వు రెండు సిక్స్‌లు కొట్టగలవని నా అంతరాత్మకు చెప్పుకున్నా.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

హ్యారీస్ రౌఫ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. కానీ చివరి రెండు బంతులను కోహ్లీ సిక్స్‌లుగా మలిచి భారత విజయానికి బాటలు వేసాడు. డౌన్ ది గ్రౌండ్ అతను కొట్టిన సిక్స్ సెంచరీ ఆఫ్ ది షాట్‌గా ఐసీసీ అభివర్ణించింది.

ఇక ఈ ఇన్నింగ్స్ తన డ్రీమ్ అని, ఇప్పటికీ ఆశ్చర్యకంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం అందరూ 'నువ్వు ఏం చేశావో నీకు తెలియదు'అని తనతో అన్నారని, అనుష్క శర్మ కూడా 'నువ్వు ఎంతమందికి సంతోషాన్నిచ్చావో నీకు తెలియడం లేదు'అని కొనియాడిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, January 13, 2024, 16:52 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+