For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs GT మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాలు ప్రాక్టీస్ చేశా: విరాట్ కోహ్లీ

Virat Kohli says ‘I batted 90 minutes in nets a day before match against GT

ముంబై: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో గంటన్నరపాటు సాధన చేశానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. దాంతోనే ఈ మ్యాచ్‌లో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగానని, ఆత్మవిశ్వాసంతో ఆడనని చెప్పాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) .. గుజరాత్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్వేచ్చగా ఆడిన విరాట్.. అభిమానులకు ఒకప్పటి తన ఆట రుచిని చూపించాడు. దాంతో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

మనోవేదనకు గురయ్యా..

మనోవేదనకు గురయ్యా..

ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ... ఫామ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో తాను జట్టు కోసం ఆశించిన రితీలో రాణించలేకపోయానని, దాంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇదే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు.

'ఈ మ్యాచ్‌లో నేను అనుకున్న విధంగా మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్‌ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే. అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు.

వారికి రుణపడి ఉంటా..

వారికి రుణపడి ఉంటా..

నేనీ మ్యాచ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో తొలిషాట్‌ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్‌లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా' అని విరాట్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఆర్‌సీబీ అదుర్స్..

ఆర్‌సీబీ అదుర్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్‌), మిల్లర్‌ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్‌ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Friday, May 20, 2022, 11:59 [IST]
Other articles published on May 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+