పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఫిట్‌నెస్‌కు తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తన జీవితంలో ఫిట్‌నెస్ అతి ముఖ్యమైనదని తెలిపాడు. ఫిట్‌గా ఉండటం వల్లే గంటలకొద్ది బ్యాటింగ్ చేయడంతో పాటు మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నానని చెప్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టిన విషయం తెలిసిందే.
ఈ ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌కు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. 'ఫిట్‌నెస్ నాకు అత్యంత ముఖ్యమైనది. టెస్ట్ క్రికెట్‌లో నేను 300 లేదా 400 ప్లస్ బాల్స్ ఆడగలను. 170 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయగలను. వన్డేల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగలను.

చాలా సునాయసంగా ఫార్మాట్‌కు తగ్గట్లు నా బ్యాటింగ్ మార్చుకోగలను. అయితే ఇవన్నీ నా ఫిట్‌నెస్ వల్లే చేయగలుగుతున్నా. అందుకే ఫిట్‌నెస్ నాకు అత్యంత ముఖ్యమైనది. నా తొలి ప్రాధాన్యత కూడా ఫిట్‌నెస్‌కే'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు రికార్డులు, లెక్కలు చూసుకోని ఆడనని, పరిస్థితులకు తగ్గట్లే బ్యాటింగ్ చేస్తానని కోహ్లీ తెలిపాడు.
సెంచరీలు, రికార్డుల కన్నా.. జట్టు విజయంలో తన పాత్ర ఉంటే ఎక్కువ సంతోషిస్తానని చెప్పాడు. విదేశాల్లో 15వ సెంచరీ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నిజం చెప్పాలంటే ఈ రికార్డులు, లెక్కలు ఇతరులు, బయటివారికి మాత్రమే. విదేశాల్లో నేను 15 సెంచరీలు చేశాను. ఇదేమి చెత్త రికార్డు కాదు. విదేశాల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉంటే మరిన్నీ సెంచరీలు చేసేవాడినేమో.
విదేశాల్లో మేం 30 మ్యాచ్‌లు ఆడొచ్చు. సరిగ్గా ఎన్ని మ్యాచ్‌లు అనేది నాకు తెలియదు. కానీ బిగ్ నంబర్ అయితే కాదు. ఇందులో కొన్ని హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. నేను హాఫ్ సెంచరీ చేస్తే సెంచరీ మిస్సయ్యానని, 120 చేస్తే డబుల్ సెంచరీ చేజార్చుకున్నానని అనిపిస్తోంది. బ్యాటింగ్ చేసేటప్పుడు జట్టు విజయం కోసం తాను ఏం చేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెడతాను.
జట్టు విజయం కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ లెక్కలు, ఘనతలు అన్ని అలా ఆడినప్పుడు దక్కినవే. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఘనతల కన్నా జట్టు విజయంలో నా పాత్ర ఉంటే ఎక్కువ సంతోషిస్తాను. పరిస్థితులు బ్యాటింగ్ అనుకూలంగా లేకున్నా.. టైమ్ తీసుకొని సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది.
నేను క్రీజులోకి వచ్చినప్పుడు విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బంతి పాతబడేవరకు నేను ఓపికగా ఆడాను. పిచ్‌తో పాటు ఔట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉండటంతో వేగంగా పరుగులు రాలేదు. ఇన్ని ప్రతీకూల పరిస్థితుల మధ్య సెంచరీ చేయడం సంతృప్తినిచ్చింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.