Kohli vs Paine: 'స్లెడ్జింగ్' అర్థరహితం అంటున్న కోహ్లీ.. వెనకడుగు వేయమంటున్న పైన్!!

అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెటర్లకు నోటి దురుసు ఎక్కువ అన్న విషయం తెలిసిందే. మైదానంలో క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ ప్రత్యర్థి ఆటగాళ్లను సూటిపోటి మాటలతో వారి ఏకాగ్రతను చెదరగొట్టడం ఎప్పటినుంచో వారికి అలవాటు. స్లెడ్జింగ్ చేసి ఆటపై పట్టుసాధించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆసీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తారు. టీమిండియాతో గురువారం ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో సైతం స్లెడ్జింగ్ విషయంలో వెనకడుగు వేయమని ఆసీస్ సారథి టిమ్ పైన్ అన్నాడు. మరోవైపు స్లెడ్జింగ్ చేయడంలో అర్థం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు.

స్లెడ్జింగ్ అర్థరహితం:
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అనవసర విషయాల వడపోత జరుగుతుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'గతంలో ఎంతో అవసరం అనుకున్నవి అంతగా ముఖ్యమైనవి కావని కొరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఈ ఏడాది గ్రహించారు. 2020 ఎంతో మందికి భిన్నమైన పాఠాలు నేర్పించింది. జట్లు, ఆటగాళ్ల మధ్య కోపతాపాలు, పట్టింపులు, ఉద్రికత్తలు నిజంగా అర్థంలేనివి' అని విరాట్ అన్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా-భారత్ తొలి టెస్టుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అడిలైడ్ ఓవల్‌లో డిసెంబర్ 17న ఉదయం డే/నైట్ టెస్ట్ మొదలు కానుంది.

మేం వెనకడుగు వేయం:
ప్రతిసారీ దూకుడుతో పనిలేదని, అవసరమైతే మాత్రం తమ ఆటగాళ్లు వెనకడుగు వేయరని టిమ్ పైన్ పేర్కొన్నాడు. 'ఆట పరంగా మైదానంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. ఆటగాళ్లకు ఎదురెళ్లడం, అతి దూకుడును ప్రదర్శించడం వంటివి ముందుగానే ప్లాన్ చేయరు. మొదట మా నైపుణ్యంతో బంతి, బ్యాటుతో ప్రణాళికలు అమలు చేస్తాం. అయితే మైదానంలో కొన్నిసార్లు పరిస్థితులు వేడెక్కుతాయి. అలాంటప్పుడు మాత్రం మేం వెనకడుగు వేయం' అని అని పైన్ అన్నాడు.

అనవసర విషయాలను వడపోయాలి:
ఒకవేళ మైదానంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అంటున్నాడు. 'ఆటలో ఎప్పుడైనా హుందాగానే ప్రవర్తించాలి. అవసరమైతే మైదానంలో దేహభాష సైతం సానుకూలంగా, దూకుడుగా ఉండేలా చూసుకోవాలి. గతంలో జరిగినవన్నీ వ్యక్తిగతంగా తీసుకుంటారని నేను అసలు అనుకోను. ఎందుకంటే ఆటలో నాణ్యత, పోటీని నిలబెట్టేందుకే అలా చేస్తాం. ఏదేమైనా ఆఖరికి అనవసర విషయాలను వడపోయాలి' అని కోహ్లీ చెప్పాడు.

ఏమాత్రం సర్దుకుపోవద్దు:
'ఐపీఎల్ టోర్నీ ఎక్కువగా ఆడటం వల్లే వడపోత సాధ్యమవుతోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వారి ప్రవర్తన, వ్యవహార శైలిని ఎంతగానో మార్చుకుంటున్నారు. ముందుగా ఈ ఏడాది క్రికెట్ మైదానంలోకి తిరిగి అడుగు పెట్టినందుకే ఎంతో సంతోషిస్తున్నారు. క్రికెట్ ఇలాగే పోటాపోటీగా, రసవత్తరంగా ఉండాలి. నాణ్యత విషయంలో ఏమాత్రం సర్దుకుపోవద్దు. ఎలాంటి ఆందోళన, ఒత్తిడి అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇప్పుడెవరూ వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
చమటోడ్చుతున్న సురేశ్ రైనా.. ఐపీఎల్ 2021నే టార్గెట్.. వేలంలోకి వస్తే కాసుల వర్షమే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications