నాలో ఈ మార్పు కారణం ఆమెనే: కోహ్లీ

ముంబై: జీవిత భాగస్వామిగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దొరకడం తన అదృష్టమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నిరంతరం మంచి కోసం తపన పడే వ్యక్తిగా అనుష్క తనను మార్చిందని చెప్పాడు. అది తన క్రికెట్ కెరీర్‌తో పాటు జీవితానికి ఎంతో సాయం చేసిందంటూ అనుష్క శర్మపై విరాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్కను కలవకపోతే.. ఈ రోజు ఇంత ఒపెన్‌గా, ధృడంగా ఉండేవాడిని కాదన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 86 టెస్టుల్లో, 248 వన్డేల్లో, 82 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటికే 70 శతకాలు బాదాడు.

అనుష్క నన్ను మార్చేసింది
టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ గురించిన విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సందర్భం వచ్చిన ప్రతిసారి అనుష్కను ప్రశంసిస్తున్న కోహ్లీ.. తాజాగా మరోసారి అభినందించాడు. 'ప్రస్తుతం ప్రతి అంశాన్ని నేను విభిన్న కోణాల్లోంచి చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్కనే. ఇందుకు సంబంధించిన పూర్తి క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. ఆమె నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. మేం ఇద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా నేర్చుకుంటాం' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

అనుష్కతో ఉండడం వల్లే
'అనుష్క శర్మ రాక ముందు నేను ఎక్కువగా భావాలు వ్యక్తం చేసేవాడిని కాదు. ప్రాక్టీకల్‌గా ఆలోచించేవాడిని కాదు. కొన్ని విషయాల్లో ఆమె నా ధృక్కోణాన్ని మార్చింది. నా మైండ్‌సెట్ కూడా మారింది. అంతకు ముందు కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే వాడిని కాదు. అయితే చాలా విషయాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె నాకు అర్థమయ్యేలా వివరించింది. సరైన రీతిలో ప్రజలకు ఉదాహరణగా ఉండడం, అన్ని విషయాలను అర్థం చేసుకోవడం.. అనుష్కతో ఉండడం వల్లే నాకు వచ్చాయి. అందుకు నేనెప్పుడూ ఆమెకు ఫుల్ క్రెడిట్ ఇస్తా. చుట్టూ ఉండే మనుషులను, పరిస్థితులను అనుష్క బాగా అర్థం చేసుకుంటుంది' అని భారత కెప్టెన్ చెప్పాడు.

ఇంతకాలం ఒకే చోట లేము
లాక్‌డౌన్‌లో విరాట్-అనుష్క గడుపుతున్న సమయం గురించి విరాట్ కోహ్లీ గతంలో ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఇలా అన్నాడు. 'మేము వివాహం చేసుకున్నప్పటి నుంచి ఒకే చోట కలిసి గడిపిన కాలం ఇది. మేము ఒకే సమయంలో ఇంతకాలం ఒకే చోట లేము. ఇది నిజంగా వింతే. సమయాన్ని గడపడానికి ఇది ఒక అవకాశంగా చెప్పలేను కానీ ఇది అలాంటిదే అని భావిస్తున్నా. మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం' అని చెప్పుకొచ్చాడు.

షాంపూ ప్రకటన కోసం
విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా.. ఆశించిన మేర ఆడలేదు. ఆపై 'అంగ్రేజీ మీడియం'లో అతిథిగా పాత్ర పోషించారు.
500 వికెట్ల క్లబ్‌లో స్టువర్ట్ బ్రాడ్.. 2వ బౌలర్‌గా అరుదైన రికార్డు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications