Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

101 మీటర్ల సిక్స్‌ కొట్టిన అయ్యర్.. వావ్ అంటూ కోహ్లీ సర్‌ప్రైజ్!!

Indvs SL 2nd T20I : Shreyas Iyer 101 Meters Long Six But Trolls On Virat And Iyer's Reactions
Virat Kohli’s priceless reaction after Shreyas Iyer’s six hits the roof goes viral

ఇండోర్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం హోల్కర్‌ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంను భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్‌లోనే ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌ (45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శ్రేయస్‌ అ‍య్యర్‌ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ ( 30 నాటౌట్‌; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.

మ్యాచ్‌కే హైలైట్‌:

మ్యాచ్‌కే హైలైట్‌:

రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అయ్యర్ కొట్టిన ఓ సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అ‍య్యర్‌లు ఉన్నారు. టీమిండియా విజయానికి 25 బంతుల్లో 28 పరుగులు కావాలి. ఈ దశలో లంక స్పిన్నర్ హసరంగ వేసిన బంతిని ముందుకు వచ్చిన అయ్యర్.. మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతే.. బంతి వెళ్లి స్టేడియం పైకప్పుని తాకి కింద పడింది.

కోహ్లీ సర్‌ప్రైజ్:

కోహ్లీ సర్‌ప్రైజ్:

అయ్యర్ కొట్టిన ఆ సిక్స్ 101 మీటర్లు వెళ్లడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కళ్లు పెద్దవి చేసి ఏం కొట్టావ్ అన్నట్టు వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మరోవైపు అయ్యర్ కూడా అదే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో కోహ్లీ నవ్వేసాడు. అనంతరం ఇద్దరు హగ్ ఇచ్చుకున్నారు. అయితే కోహ్లీ ఇలా స్పందించడానికి కారణం ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను ఔట్ చేసిన హసరంగ‌ని.. కోహ్లీ కూడా జాగ్రత్తగా ఆడాడు. అతని బౌలింగ్‌లో అయ్యర్ సిక్స్ కొట్టేసరికి కోహ్లీ సర్‌ప్రైజ్ అయ్యాడు.

అయ్యర్‌ సూపర్ షాట్:

అయ్యర్‌ సూపర్ షాట్:

ప్రస్తుతం కోహ్లీ, అయ్యర్‌లకు సంబందించిన ఎక్స్‌ప్రెషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యర్‌ 'సూపర్ షాట్' అని కొందరు అభినందిస్తుంటే.. కోహ్లీకి జతగా నువ్వు కూడా తయారయ్యావా అని మరొకొందరు ట్రోల్ చేస్తున్నారు. విండీస్ బౌలర్ విలియమ్స్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన కోహ్లీ ఇదే తరహాలో ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'పఠాన్‌ నిస్వార్థ ఆటగాడు.. జట్టు కోసం ఏదైనా చేసేవాడు'

మూడో స్థానంలో అయ్యర్

మూడో స్థానంలో అయ్యర్

కోహ్లీ మాములుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే ఇండోర్ టీ20లో మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ మూడో స్థానంలో వచ్చాడు. ఆపై నాలుగో స్థానంలో కోహ్లీ వచ్చాడు. మ్యాచ్‌ అనంతరం నాలుగో స్థానానికి రావడానికి గల కారణాలను కోహ్లీ చెప్పాడు. 'జట్టు విజయాలపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అయ్యర్‌ను మూడో స్థానంలో పంపిచా. ఒత్తిడిలో మ్యాచ్‌ను ముగించడానికి యువ ఆటగాళ్లు అలవాటుపడాలి. అందుకే వారికి అవకాశాలు ఇవ్వాలనుకున్నా. నేను మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలను. వాంఖడేలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో కూడా నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చా' అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Wednesday, January 8, 2020, 14:54 [IST]
Other articles published on Jan 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+