అందుకే ఓడిపోయాం.. ఆఖరి మ్యాచ్ వరకు ఆర్‌సీబీలోనే ఉంటా: విరాట్ కోహ్లీ

షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ల ఆధిపత్యానికి సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్ తోడవడంతో ఓటమికి తలవంచాల్సి వచ్చిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేకేఆర్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మరోసారి ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన విరాట్.. పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నామన్నాడు. మరో 15 పరుగులు అదనంగా చేసినా.. ధారళంగా పరుగులిచ్చిన రెండు ఓవర్లను కట్టడిగా బౌలింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇక వచ్చే సీజన్ నుంచి కేవలం ప్లేయర్‌గానే కొనసాగుతానన్న కోహ్లీ.. తన కెరీర్ లాస్ట్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలోనే ఉంటానన్నాడు.

స్పిన్నర్ల ఆధిపత్యం..
'ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఉన్న తేడా కేకేఆర్ స్పిన్నర్ల ఆధిపత్యం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వారు కట్టడిగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీసారు. మాకు మంచి ఆరంభం లభించింది. దాన్ని అలానే కొనసాగించి భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నాణ్యమైన బౌలింగ్ ముందు అది కుదరలేదు. ఇక ఆర్‌సీబీ బౌలర్ల అద్భుతంగా రాణించారు. ఈ సీజన్ ఆసాంతం ఆకట్టుకున్నారు. కానీ ఈ రోజు మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆడిన ఆ ఒక్క బిగ్ ఓవర్(డానియల్ క్రిస్టియన్ వేసిన) మా అవకాశాలను లాగేసింది. అయినా మేం చివరి వరకు పోరాడం. మరో 15 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది. అంతేకాకుండా ధారళంగా పరుగులిచ్చిన ఆ రెండు ఓవర్లు కట్టడి చేసినా మ్యాచ్‌లో నిలిచేవాళ్లం

ఆర్‌సీబీ తరఫునే ఆడుతా..
నరైన్ ఓ క్వాలిటీ బౌలర్. ఈ రోజు మరోసారి అతను తానెంటో నిరూపించుకున్నాడు. అందుకే అతను ఐపీఎల్‌లో నిలకడగా వికెట్లు తీసే బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అతనొక్కడే కాదు షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా బ్యాటర్స్‌పై ఒత్తిడి తెచ్చారు. భారీ షాట్స్ ఆడకుండా అడ్డుకున్నారు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా నా సాయశక్తులా జట్టు కోసం ప్రయత్నించా. యువ ఆటగాళ్లను ప్రొత్సహించే ప్రయత్నం చేశా. టీమిండియాలో కూడా అదే చేస్తున్నా. జట్టు కోసం 120 శాతం ఎఫర్ట్ పెట్టా. వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగా కొనసాగుతా. మెగా వేలం నేపథ్యంలో జట్టు పూర్తిగా మారనుంది. మరో మూడేళ్లకు అవసరమయ్యే టీమ్‌ను తీసుకోవాల్సి ఉంది. కెప్టెన్సీ వదులుకున్నా.. ఆర్‌సీబీకే ఆడుతా. నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీలోనే ఉంటా. ఇప్పటికే ఈ విషయంపై ఫ్రాంచైజీకి మాట ఇచ్చా'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

నరైన్ దెబ్బ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications