
హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు ఫన్నీ కామెంట్లతో టీమిండియా కెప్టెన్‌ను ఓ ఆటఆడుకుంటున్నారు. న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ సంతోషంతో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో కోహ్లీతో పాటు పేసర్ మహ్మద్ షమీ, ఓపెనర్ పృథ్వీషా ఉన్నారు.
ఈ ముగ్గురూ తమ కళ్లని విచిత్రంగా పైకి తిప్పుతూ నాలుకలు బయటకు పెట్టి ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోను కోహ్లీ నయా పోస్టు, సుందర్ దోస్త్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇంకేముందు మరో మీమ్ మెటీరియల్ దొరికిందంటూ నెటిజన్లు విచిత్రమైన, ఫన్నీ కామెంట్స్ చేసున్నారు. బెగ్గర్స్‌ను మించిపోయారని ఒకరంటే.. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో కామెంట్ చేస్తున్నారు.
ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. నిలకడలేమి ఆటతో విఫలమవుతున్న మయాంక్(81), పంత్(70) అర్ధశతకాలతో ఫామ్‌లోకి వచ్చారు. మరోవైపు పేసర్లు మహ్మద్ షమీ(3), బుమ్రా(2), నవ్‌దీప్(2) సైతం తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఈనెల 21 నుంచి ప్రారంభమవుతున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత్ కావాల్సిన ప్రాక్టీస్ లభించింది.