Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీ.. కొంచెం నిదానంగా బిల్డింగ్ ఊగిపోతుంది: కోహ్లీ

Virat Kohli’s funny reaction on Harbhajan Singh’s workout video

ముంబై: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఆటగాళ్లంత ఇంటికే పరిమితమయ్యారు. తమ జీవితంలో ఎన్నడూ ఊహించని ఈ క్వారంటైన్ సమయాన్ని తమకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో ఇన్‌స్టా లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌‌లు లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలోకంటే సోషల్‌‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్లను అందిచడమే కాక.. ఇతర క్రికెటర్లతో సంభాషిస్తున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.

తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ డంబుల్స్‌తో వర్కౌట్స్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను 'ఎక్సర్‌సైజ్ మస్ట్'అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు. ఈ వీడియోపై కోహ్లీ రియాక్షన్ అభిమానులచే నవ్వులు పూయిస్తోంది. బజ్జీ డంబుల్స్ ఎత్తడంపై కోహ్లీ ఫన్నీగా స్పందించాడు. 'వెల్‌డన్ పాజీ.. కానీ కాస్త నిదానంగా.. బిల్డింగ్ ఊగిపోతుంది'అని సరదాగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

Virat Kohli’s funny reaction on Harbhajan Singh’s workout video

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. భారత్ తరఫున టీ20 క్రికెట్ ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఐపీఎల్‌లో తాను అద్భుతంగా రాణిస్తున్నా.. తనను ఓ ఆటగాడిగా పరిగణించడం లేదని సెలెక్టర్లపై మండిపడ్డాడు. వరల్డ్ బెస్ట్ ఆటగాళ్లు ఆడే ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పుడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకు ఆడలేనని ప్రశ్నించాడు. సెలెక్టర్లు తనకు వయసు అయిపోయిందనుకుంటున్నారనీ, కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో కనుక తాను రాణిస్తే.. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లు ఆడేందుకు అన్ని విధాల సిద్దమవుతానని తెలిపాడు.

ఇక హర్భజన్‌ 2016 మార్చి నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 103 టెస్టుల్లో 417, 236 వన్డేల్లో 269, 28 టీ20ల్లో 25 వికెట్లు తీశాడు. ఓవైపు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూనే మరోవైపు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Tuesday, May 26, 2020, 21:01 [IST]
Other articles published on May 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+