Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పోలీస్ స్టేషన్లో విరాట్ కోహ్లీ కారు.. ఇంతకూ ఏం జరిగిందంటే?

Virat Kohli’s first car now lying abandoned in Maharashtra Police station

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడి కారు మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్లో ఉంది. మీరు చూస్తున్నది నిజమే. మరి కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు కదా.. మరి అతని కారు మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్లో ఉండటం ఏంటని అనుకుంటున్నారా?. మరేంలేదండి.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నది భారత సారథి కొన్న మొదటి ఆడి కారు. ఇప్పుడు ఆ కారు కోహ్లీ పేరిట కూడా లేదు. అసలు విషయంలోకి వెళితే...

కొత్త కారు లాంచ్ చేసిందంటే:

కొత్త కారు లాంచ్ చేసిందంటే:

విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్ఫార్మాట్ ఏదైనా బరిలోకి దిగదంటే.. పరుగుల వరద పారాల్సిందే. ఎంతటి టాప్ బౌలర్ అయినా సరే మనోడి ముందు తేలిపోవాల్సిందే. విరాట్ పరుగులు చేయడంలోనే కాదు.. ఎన్నో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'లు కూడా గెలుచుకున్నాడు. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో కోహ్లీ దగ్గర చాలా లగ్జరీ కార్లున్నాయి. ఆడి ఇండియాకు చాలా కాలంగా అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నాడు. ఆడి సంస్థ భారత్‌లో కొత్త కారు లాంచ్ చేసిందంటే.. అది ముందు కోహ్లీ దగ్గరకే వస్తుంది.

స్కామ్‌లో సాగర్:

స్కామ్‌లో సాగర్:

మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు, ఆడి నుంచి కొత్త మోడళ్లు వస్తుండటంతో విరాట్ కోహ్లీ దగ్గర చాలా కార్లు అయ్యాయి. 2012లో తొలిసారి ఆడి ఆర్8 కారును కొనుగోలు చేసిన కోహ్లీ.. 2016లో సాగర్ థక్కర్ అనే వ్యక్తికి రూ.2.5 కోట్లకు దాన్ని అమ్మేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం సాగర్.. విరాట్ దగ్గర కారు కొన్నాడు. అయితే కారును కొనుగోలు చేసిన రెండు నెలలకే సాగర్ ఓ స్కామ్‌లో చిక్కుకొన్నాడు. దీంతో సాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో సాగర్ ఇల్లు, ఆస్తులపై మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు.

పోలీసు స్టేషన్‌లో కారు:

పోలీసు స్టేషన్‌లో కారు:

మహారాష్ట్ర పోలీసులు సాగర్ థక్కర్ ఇల్లు, ఆస్తులపై దాడులు చేసి అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. సాగర్ ఇంటి ప్రాంగణంలో ఉన్న ఆడి కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌లో ఓ మూలన పడేశారు. ఆ కారును అసలు వాడకపోవడంతో ధూళి పేరుకొనిపోయి శిథిలావస్థకు చేరుకుంది. తెల్ల కారు కాస్త ఆ ఛాయలు లేకుండా మారిపోయింది. ఆలా కోహ్లీ కారు పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది. అయితే పోలీసులు కారును సీజ్ చేసేటపట్టికే పేపర్ వర్క్ పూర్తి చేయడంతో కోహ్లీకి చిక్కులు తప్పాయి. లేదంటే కోహ్లీ పేరుమీద కేస్ బుక్ అయ్యేది.

తొలి టెస్టు తర్వాత భారత్‌కు:

తొలి టెస్టు తర్వాత భారత్‌కు:

సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆస్ట్రేలియా గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో తల్లి కాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు తర్వాత వైదొలుగుతున్న సంగతి తెలిసిందే.

'టెస్టుల్లో కీపింగ్ స్కిల్స్‌కే మొదటి ప్రాధాన్యత.. నా ఓటు ఎప్పుడూ సాహాకే'

Story first published: Saturday, December 12, 2020, 17:51 [IST]
Other articles published on Dec 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+