ఇద్దరు వికెట్ కీపర్లు:
టెస్ట్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే ఇద్దరూ బ్యాటింగ్‌లో నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నారు. ఇక కీపింగ్‌లో మాత్రం పంత్‌తో పోలిస్తే సాహా అత్యుత్తమం. ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో పంత్‌కు బదులు సాహాని ఆడించాలని సూచించాడు. మంజ్రేకర్ తాజాగా ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

నా ఓటు సాహాకే:
మొదటి టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడితే బాగుంటుంది అని ఓ అభిమాని అడిగాడు. దానికి సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 'టెస్టుల్లో ఎప్పుడూ కీపింగ్ స్కిల్స్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకో ఓ ఉదాహరణ చెపుతా.. ఒకవేళ స్టీవ్ స్మిత్ క్యాచ్‌ని ఆరంభంలో కీపర్ చేజారిస్తే అతను డబుల్ సెంచరీ చేస్తాడు. కాబట్టి కీపర్‌గా వృద్ధిమాన్ సాహాని ఆడిస్తే బాగుంటుంది. పేస్ పిచ్‌లు ఉండే ఆస్ట్రేలియాలో బెటర్ కీపర్ ఉండాలి. అందుకే నా ఓటు సాహాకే' అని సంజయ్ స్పష్టం చేశాడు.

నిలకడగా రాణిస్తున్న సాహా:
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్.. టెస్టు సిరీస్‌లో సెంచరీ చేశాడు. కానీ 2019లో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా సాహాకే టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ సాహా నిలకడగా రాణించగా.. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కీపర్‌గానూ పంత్ విఫలమయ్యాడు. దాంతో తొలి టెస్టులో సాహానే ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ వన్డే, టీ20లలో కీపర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

సాహాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా:
ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌ల్లోనూ టీమిండియా రిషబ్ పంత్‌ను ఆడించలేదని, దాంతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు అతడో పర్యాటకుడిలా వెళ్లాడని ఆకాష్ చోప్రా విమర్శించాడు. పంత్ ఇలానే జట్టుతో కొనసాగడం కూడా ఓ సమస్యగా మారనుందని తెలిపాడు. పంత్ అలాగే జట్టుతో కొనసాగితే.. వృద్ధిమాన్ సాహాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడని.. దాంతో అటు టీమిండియాకు, ఇటు దేశవాళీ ఆడే అవకాశం కోల్పోతాడని చోప్రా చెప్పాడు. 2021 ఐపీఎల్ అయ్యేంత వరకు అతడు మళ్లీ జాతీయ జట్టులో కనపడే అవకాశం లేదని జోస్యం చెప్పాడు.
వైరల్ ఫొటో.. జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ రొమాంటిక్ క్లిక్!!


Click it and Unblock the Notifications












