Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vamika: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. టీవీలో కనిపించిన కోహ్లీ కూతురు! (వీడియో)

Virat Kohli’s daughter Vamikas first photo goes viral

కేప్ టౌన్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికా టీవీలో కనిపించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మతో ఉన్న వామికా కెమెరా కంటికి చిక్కింది. గతేడాది కాలంగా మీడియా కంటపడకుండా.. ఫొటోలు రిలీజ్ చేయకుండా తమ కూతుర్ని దాస్తున్న కోహ్లీ-అనుష్కల ప్రయత్నం భగ్నమైంది.

సౌతాఫ్రికా పర్యటనకు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వచ్చాడు. అయితే కేప్ టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు అనుష్క శర్మ వామికాతో కలిసి హాజరైంది. అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. రీప్లేలో కనిపించడంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. అయితే ఇందులో వామిక పూర్తి ముఖం కనిపించకున్నా.. ఆ చిన్నారి కళ్లు, ముక్కు సైడ్​లుక్​లో బాగానే కనిపిస్తుంది. అభిమానులు ఈ ఫొటో, వీడియోను ట్రెండింగ్​ చేస్తూ విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ చేస్తున్నారు.

తమ అభిమాన క్రికెటర్ ముద్దుల తనయను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ విరుష్క జోడీ మొదట్నుంచి వామికకు సంబంధించిన ఫొటోలు, ఆమె ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు ముఖం కనిపించడకుండా ఉన్న పాప ఫొటోలను పోస్ట్​ చేశారు. ఈ క్రమంలోనే వామికా కోసం అందరిలో ఆతృత నెలకొంది.

సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు ఎయిర్ పోర్ట్‌లో వామికా ఫొటో కోసం ఫొటోగ్రాఫర్లు తెగ ప్రయత్నించారు. మీడియా కంటపడకుండా అనుష్క వామికాను అదిమి పట్టడంతో చిన్నారి రూపం సగమే కెమెరాలకు చిక్కింది. అయితే ఫొటోగ్రాఫర్లపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి'అని మర్యాదపూర్వకంగానే స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. విరాట్ మాటలను ఏ మాత్రం పట్టించుకోని పాపరాజీలు(ఫొటోగ్రాఫర్లు)... వామికా ఫొటో కోసం శతవిధాల ప్రయత్నించారు. వామికా ఫొటో ఇదే అంటూ ఒకటి నెట్టింట వైరల్ కూడా అయింది.

గతేడాది జనవరి 11న పుట్టిన వామికా.. సౌతాఫ్రికా పర్యటనలోనే తొలి బర్త్‌డే జరుపుకుంది. అయితే పుట్టినప్పటి నుంచి తన కూతురిని మీడియాకు దూరంగా ఉంచాలని భావించిన విరుష్క దంపుతులు.. మీడియా చానెళ్లన్నటికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పాపరాజీలను కూడా స్పెషల్‌గా రిక్వెస్ట్ చేశారు.

Story first published: Sunday, January 23, 2022, 19:42 [IST]
Other articles published on Jan 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+