Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: సింగిల్‌కే సెంచరీలా ఫీలైన కోహ్లీ.. రోహిత్‌తో కలిసి సెలెబ్రేట్!(వీడియో)

ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు పరుగుల ఖాతా తెరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. క్విక్ సింగిల్ తీసి ఊపిరి పిల్చుకున్నాడు. ఎట్టకేలకు సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ వైపు చూస్తూ.. సింగిల్ సాధించానని సైగలు చేశాడు.

కోహ్లీ సింగిల్‌ను అభిమానులు కూడా ఆస్వాదించారు. గట్టిగా అరుస్తూ సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సింగిల్ ఇచ్చిన ఊపో లేక అభిమానుల నుంచి అరుపుల కిక్కో తెలియదు కానీ ఆ వెంటనే కోహ్లీ బౌండరీత బాదాడు. ఇప్పటికే మూడు బౌండరీలు బాదిన కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్నాడు.

Virat Kohli s Cheeky Celebration After Taking a Single Run in ODI Series vs Australia Goes Viral
Photo Credit: X (twitter)

మరోవైపు రోహిత్ శర్మ 63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య 57 పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. శుభ్‌మన్ గిల్(24) మరోసారి నిరాశపర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. క్రీజులోకి వచ్చే సమయంలో సిడ్నీ ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మాథ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, October 25, 2025, 14:49 [IST]
Other articles published on Oct 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+