Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ వినూత్న 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌'.. మీరూ ఓ లుక్కేయండి!! (వీడియో)

Virat Kohlis Bottle Cap Challenge Comes With A Unique Twist with Ravi Shastris commentary in background

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో 'బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌' విసృత్తంగా పాకిపోతున్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌ను ప్రోత్సహిస్తూ సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సైతం తన బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్‌లు ఇదివరకే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా చేరాడు.

వినూత్నంగా చాలెంజ్‌:

మాములుగా 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌' అంటే.. మూత ఉన్న నీళ్ల బాటిల్‌ను ఒక కాలితో తన్ని ఓపెన్‌ చేయాలి. శిఖర్ ధావన్ అయితే బంతిని బ్యాట్‌తో కొట్టి చాలెంజ్‌నెగ్గాడు. అయితే కోహ్లీ మాత్రం సరికొత్తగా ఆలోచించి వినూత్న ప్రయత్నం చేశాడు. కోహ్లీ తన బ్యాట్‌తో ఈ చాలెంజ్‌ను పూర్తి చేసాడు. ఎదురుగా ఉన్న బాటిల్‌ మూతను తన అద్భత బ్యాటింగ్‌ నైపుణ్యంతో తొలగించాడు. అనంతరం బాటిల్‌ తీసుకుని నీళ్లు తాగాడు. అయితే కోహ్లీ ఎడమ వైపు నుండి ఆడడం విశేషం.

రవిశాస్త్రి కామెంట్రీ:

రవిశాస్త్రి కామెంట్రీ:

ఈ వీడియోను విరాట్ కోహ్లీ తన ట్విటర్‌లో పోస్టు చేసాడు. 'ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేయడం మంచిది' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే ఆ వీడియోకి కోచ్‌ రవిశాస్త్రి కామెంట్రీ తోడవ్వం మరింత ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికే వేల మంది క్రికెట్ అభిమానులు లైకులు, రీట్వీట్లు చేశారు.

తొలిసారి బ్యాట్‌ పట్టా:

తొలిసారి బ్యాట్‌ పట్టా:

విండీస్ పర్యటనకు ముందు యువరాజ్‌ సింగ్‌ విసిరిన బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ను ధావన్‌ స్వీకరించాడు. చాలెంజ్‌లో భాగంగా తనదైన శైలిలో బ్యాట్‌తో బంతిని కొట్టి బాటిల్‌ క్యాప్‌ను కిందపడేశాడు. అనంతరం ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'యువీ.. ఇది నా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌. గాయం తర్వాత తొలిసారి బ్యాట్‌ పట్టా. చాలా ఆనందంగా ఉంది' అని రాసుకొచ్చాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. సింధు, సైనాల మధ్య సెమీస్ సమరం!!

 అరుదైన రికార్డుకు చేరువలో:

అరుదైన రికార్డుకు చేరువలో:

టీమిండియా ఆదివారం రాత్రి పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నమోదు చేసేందుకు 19 పరుగుల దూరంలో కోహ్లీ (1912) ఉన్నాడు. పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ (1930) పరుగులతో కోహ్లీ కంటే ముందున్నాడు. జావెద్‌ 26 ఏళ్లుగా ఈ జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Sunday, August 11, 2019, 14:43 [IST]
Other articles published on Aug 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+