ధర్మశాల: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన చారిత్రాత్మక 900వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు కనీస ప్రదర్శన చూపకుండానే లొంగిపోవడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో అంకితభావం, పట్టుదల, పోరాటస్ఫూర్తి లోపించాయని గంగూలీ అభిప్రాయపడ్డాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్ లు జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత కివీస్ ఆటగాళ్లు పోరాటాన్ని మరచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశాడు.
ధర్మశాల వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0తేడాతో టీమిండియా ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా తొలి వన్డేలో అదే జొరుని కొనసాగించింది.

ఈ సందర్భంగా గంగూలీ సోమవారం మీడియాతో మాట్లాడారు. 'నిన్నటి వన్డే మ్యాచ్ చూశాను. అంతకుముందు టెస్టు సిరీస్ కూడా చూశాను. ఆ జట్టులో నిర్లక్ష్యం కనబడుతోంది. ఈ సిరీస్‌ను తొందరగా ముగించేసి వెళ్ళిపోవాలనే ఆతృతలో వారు ఉన్నట్లు కనబడుతోంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 190 పరుగులకే ఆలౌట్ అవ్వడాన్ని గంగూలీ తప్పుబట్టారు. మ్యాచ్‌కు సిద్ధమయి మైదానంలో దిగిన తర్వాత మొత్తం ఆశల్ని వదిలేస్తున్నారని తెలిపాడు. టెస్టు సిరిస్‌లో విఫలమైనా, భారత జట్టును ఓడించాలనే కసి వాళ్లలో లోపించిందని అన్నాడు.
'మార్టిన్ గుప్టిల్ ఔటైన తరువాత ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. ప్రత్యేకంగా కేన్ విలియమ్సన్, రాస్‌టేలర్ ఔటైన విధానాన్ని చూడండి. మ్యాచ్‌పై ఎటువంటి శ్రద్ధ లేకుండా ఆడినట్లు కనిపిస్తుంది. కనీసం 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి టిమ్ సౌథీ చూపిన పోరాటం కూడా మిగతా ప్రధాన ఆటగాళ్లు చూపలేకపోయారు. కివీస్ ఆటగాళ్లు ఎందుకిలా ఆడుతున్నారు' అని ప్రశ్నించాడు.
కాగా ధర్మశాలలో జరిగిన వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ ఫాన్‌ని కొనసాగించాడు. 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలోకీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో టీమిండియా గెలిచిన మ్యాచ్‌ల్లో 70 ఇన్నింగ్స్‌లు ఆడి 32 అర్ధ సెంచరీలు చేశాడు.
కాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 107 ఇన్నింగ్స్‌లు ఆడి 34 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. మైదానంలో విరాట్ కోహ్లీ ఆడే ఆటతీరుని చూస్తుంటే పరుగుల మెషిన్‌లాగా ఉండాడని గంగూలీ వ్యాఖ్యానించాడు.