Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లోయర్ ఆర్డర్ సరిగాలేకనే ఓడిపోయాం: కోహ్లీ

Virat Kohli rues absence of all-rounder in side after 43-run loss to Windies in 3rd ODI

హైదరాబాద్: గాయాల కారణంగా ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ టీమిండియాకి దూరమవడంతో జట్టులో సమతూకం దెబ్బతిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. పుణె వేదికగా శనివారం ముగిసిన మూడో వన్డేలో ఆరుగురు బ్యాట్స్‌మెన్స్, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిన భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో పోరాడినా.. అతనికి సహకారం అందించే బ్యాట్స్‌మెన్ జట్టులో కరవైయ్యారు.

పాండ్యా ఉన్నట్లయితే.. బౌలింగ్, బ్యాటింగ్‌తోనూ

పాండ్యా ఉన్నట్లయితే.. బౌలింగ్, బ్యాటింగ్‌తోనూ

ఒకవేళ జట్టులో కేదార్, హార్దిక్ పాండ్యా ఉండినట్లయితే.. బౌలింగ్, బ్యాటింగ్‌తోనూ సహాయపడేవారని కోహ్లి వెల్లడించాడు. ‘జట్టులో హార్దిక్, కేదార్ ఉండింటే లోయర్ ఆర్డర్ బలంగా ఉండేది. బ్రబౌర్న్ వేదికగా సోమవారం జరిగే నాలుగో వన్డేలో కేదార్ జాదవ్ తుది జట్టులోకి వస్తాడు. అతని రాకతో బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ అదనపు బలం జట్టుకి చేకూరుతుంది. మొదట నుంచి కూడా మేము జట్టులో సమతూకం కోసం ప్రయత్నిస్తున్నాం' అని కోహ్లీ వెల్లడించాడు.

'ధోనీని తొలగించడం సరైన నిర్ణయమే'

 మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం

మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం

‘విండీస్‌ మా ముందు ఛేదించదగ్గ లక్ష్యాన్నే ఉంచింది. కానీ మేము ఛేదించే క్రమంలో సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం. కానీ విజయం సాధించడానికి మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

వాళ్లది అద్భుతమైన ప్రదర్శన పూర్తిగా అర్హులు

వాళ్లది అద్భుతమైన ప్రదర్శన పూర్తిగా అర్హులు

మరోవైపు విండీస్‌ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తమకంటూ అవకాశం వస్తే విండీస్‌ ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు అని కోహ్లీ అన్నాడు. జట్టులో సరైన ఆల్‌రౌండర్‌ లేకపోవడం కూడా లోటేనని ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం ఇటీవల సెలక్టర్లు జట్టుని ప్రకటించగా.. అందులో తొలుత కేదార్ జాదవ్‌కి చోటు లభించలేదు. అయితే.. ఆ తర్వాత అతను సెలక్టర్లని ఘాటుగా ప్రశ్నించడంతో మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు.

43పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్‌

43పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్‌

అంతకుముందు మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. మొదటి 35ఓవర్లు వరకూ విండీస్‌ను కట్టడి చేస్తూనే వచ్చాం. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగించి ఉంటే మా ముందు లక్ష్యం 260లోపే ఉండేది. కానీ చివరి పది ఓవర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపించిందన్నారు. పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 43పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 29, 2018, 10:07 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+