Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ జట్టులో కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్!

క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్‌తో ఈ ఏడాది టెస్ట్ సీజన్ ముగిసింది. ఈ ఏడాది మొత్తం 34 టెస్ట్ మ్యాచ్‌లు జరగ్గా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్ విజేతగా నిలిచింది.

ఈ 34 మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ని ఎంపిక చేసింది. ఈ జట్టులో మొత్తం 6 దేశాల నుంచి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు ఎంపికవ్వగా..శ్రీలంక నుంచి దిముత్ కరుణరత్నే అవకాశాన్ని అందుకున్నాడు.

Virat Kohli, Rohit Sharma and Steve Smith snubbed in Cricket Australia’s Test Team of the Year

న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ ఎంపికవ్వగా.. ఇంగ్లండ్‌ నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. జోరూట్, హ్యారీ బ్రూక్‌తో పాటు స్టువర్ట్ బ్రాడ్ ఈ అత్యుత్తమ టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యారు. సౌతాఫ్రికా నుంచి కగిసో రబడా, ఐర్లాండ్ నుంచి లోర్కాన్ టక్కర్ చోటు దక్కించుకున్నారు.

భారత్ నుంచి స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఎంపికయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాటు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, నాథన్ లయన్‌లకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా చోటివ్వలేదు.

ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే ఎంపికవ్వగా.. మిడిలార్డర్ ‌లో కేన్ విలియమ్సన్, జోరూట్, హ్యారీ బ్రూక్ చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా ఐర్లాండ్ ప్లేయర్ లోర్కాన్ టక్కర్ ఎంపికయ్యాడు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఎంపికవ్వగా.. పేసర్లుగా ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, స్టువర్ట్ బ్రాడ్ చోటు దక్కించుకున్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్:
ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, న్ విలియమ్సన్, జోరూట్, హ్యారీ బ్రూక్, లోర్కాన్ టక్కర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, స్టువర్ట్ బ్రాడ్.

Story first published: Sunday, December 31, 2023, 15:20 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+