బాబర్ ఆజమ్ భారత్-పాక్ టీ20 ఎలెవన్.. ధోనీనే కీపర్!

కరాచీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా ఇరు జట్ల ఫ్యాన్స్‌తో మైదానం కిక్కిరిసిపోతుంది. అయితే ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో గత కొంత కాలంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ దాయాదీ దేశాలు తలపడుతున్నాయి.

ఫాంటసీ క్రికెట్‌కు క్రేజ్
ఇక కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఫాంటసీ క్రికెట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. చాలా మంది ఆటగాళ్లు ఆల్‌టైమ్ ఎలెవన్... బెస్ట్ టీమ్స్ అంటూ అనేక జట్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను భారత్-పాక్ సంయుక్త జట్టును ఎంపిక చేయమని ప్రశ్నించగా.. అతను టీ20 ఫార్మాట్‌ను ఎంచుకున్నాడు.

ఆరుగురు భారత్ ఆటగాళ్లే..
క్రిక్‌బజ్ వేదికగా ప్రముఖ కామెంటేటర్ హర్షాబోగ్లే హోస్ట్‌గా నిర్వహించిన లైవ్ షోలో ఈ పాక్ కెప్టెన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత్-పాక్ టీ20 ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం విశేషం.ఇక ఈ జట్టులో రోహిత్ శర్మకు జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని తెలిపాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడోస్థానంలో ఎంపిక చేసిన బాబర్.. షోయబ్ మాలిక్‌ను నాలుగో స్థానంలో తీసుకున్నాడు.

కీపర్ ధోనీనే..
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఐదో స్థానంలో ఎంపిక చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతనికే అప్పగించాడు. షాదాబ్ ఖాన్, హార్దిక్ పాండ్యాలను ఆల్‌రౌండర్లుగా తీసుకున్నాడు. స్పిన్నర్లుగా కుల్‌దీప్ యాదవ్‌తో పాటు షాదాబ్ ఖాన్‌ను పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో షాహిన్ అఫ్రిదీ, మహ్మద్ ఆమిర్‌లను తీసుకున్న బాబర్.. భారత్ నుంచి ఒక జస్‌ప్రీత్ బుమ్రాకే అవకాశం ఇచ్చాడు.
బాబర్ భారత్-పాక్ టీ20 ఎలెవన్
రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ, షోయబ్ మాలిక్, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్దిక్ పాండ్యా, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ ఆమిర్, కుల్దీప్ యాదవ్

విరాట్‌లా విజయలందిస్తా..
ఈ లైవ్ సెషన్‌లో విరాట్ కోహ్లీపై బాబర్ ఆజమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ ఆటగాడని, విరాట్‌కు తాను చాలా దూరంలో ఉన్నానని తెలిపాడు. ‘కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతనికి నేను చాలా దూరంలో ఉన్నా. నేను ఇంకా చాలా సాధించాల్సి ఉంది. అతనిలా ఆడేందుకు ప్రయత్నిస్తా. విరాట్‌లా ఆడుతూ పాకిస్థాన్‌కు విజయాలందిస్తా. రికార్డులు సృష్టిస్తా'అని బాబర్ చెప్పుకొచ్చాడు. కవర్ డ్రైవ్స్ అద్భుతంగా ఆడే బాబర్‌ను.. ఇతర ఆటగాళ్లలో నచ్చే ఐదు షాట్లు చెప్పమని హర్షా బోగ్లే ప్రశ్నించాడు. దీనికి 1. కోహ్లీ కవర్ డ్రైవ్, 2. రోహిత్ ఫ్లిక్, 3. స్మిత్ స్ట్రెయిట్ డ్రైవ్, 4. డివిలియర్స్ ఫుల్, విలియమ్సన్ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్లంటే తనకిష్టమని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications