Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: జోరుగా టీమిండియా ప్రాక్టీస్‌.. తొలిసారి అందరూ కలిసి! బ్యాట్ లేకుండా కోహ్లీ సాధన!

Virat Kohli, Rohit Sharma and Ajinkya Rahane practice session for WTC Final 2021

లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ)​ ఫైనల్​ కోసం ఇంగ్లండ్​లో ఉన్న విషయం తెలిసిందే. గత శనివారం మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ పూర్తవడంతో.. ఒక్కో భారత ప్లేయర్ మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేశారు. ఇక గురువారం టీమిండియా ఆటగాళ్లు అందరూ కలిసి తొలిసారి మైదానంలోకి దిగి సాధన చేశారు. దాదాపు నాలుగు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఒకవైపు వార్మప్ చేస్తూ.. మరోవైపు ప్రాక్టీస్ చేశారు.

జోరుగా టీమిండియా ప్రాక్టీస్‌

డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచులు లేకపోవడంతో నెట్ సెషన్‌లోనే భారత ఆటగాళ్లు అందరూ శ్రమిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాలు సాధనలో మునిగిపోయారు. అందరూ నెట్ సెషన్‌లో చమటోడ్చారు. కోహ్లీ బ్యాట్ లేకుండా పోజులివ్వగా.. రోహిత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా సాధన చేశారు. ఇక సిరాజ్, అశ్విన్, బుమ్రా, ఇశాంత్, షమీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరి బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్‌ ప్రాక్టీస్ చేశారు.

సూర్యుడు చిరునవ్వులను తీసుకొస్తాడు

భారత ఆటగాళ్ల సాధనకు సంబందించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఇదే మా మొదటి సమూహ శిక్షణ. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ చాలా తీవ్రతగా ఉంది' అని బీసీసీఐ పేర్కొంది. ఇక మూడు రోజుల క్వారంటైన్​ అనంతరం అందరూ మైదానంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సహచరులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించి కోహ్లీ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. మైదానంలో రన్నింగ్ చేసిన అనంతరం సూర్యరశ్మి పడిన ఫొటోను పెట్టాడు. 'సూర్యుడు చిరునవ్వులను తీసుకొస్తాడు' అనే క్యాప్షన్​ పెట్టాడు. పుజారా, శుభ్​​ గిల్​, కోహ్లీ ఇందులో ఉన్నారు.

అందరూ కలిసి ప్రాక్టీస్

అందరూ కలిసి ప్రాక్టీస్

ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్స్.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. ముంబైలో రెండు వారాల క్వారంటైన్‌ తర్వాత భారత ఆటగాళ్లు జూన్‌ 3న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్‌ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆపై మూడు రోజులు ఒక్కో ప్లేయర్ సాధన చేశారు. ఇప్పుడు అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏజీస్‌ బౌల్‌ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్‌ హోటల్‌లో కోహ్లీసేన బస చేస్తున్నది.

Dingko Singh: భారత మాజీ బాక్సర్‌ కన్నుమూత!!

న్యూజిలాండ్‌కు కావాల్సిన ప్రాక్టీస్‌

జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్‌లో తలపడతాయి. దీంతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు కావాల్సిన ప్రాక్టీస్‌ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా ఇప్పుడే ప్రాక్టీస్ ఆరంభించింది. డబ్యూటీసీ ఫైనల్‌ ముగిసాక 42 రోజుల పాటు కోహ్లీసేన ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్టు​ 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది.

Story first published: Thursday, June 10, 2021, 12:19 [IST]
Other articles published on Jun 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+