For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే నా కూతురు ఫొటోలు బయట పెట్టడం లేదు: విరాట్ కోహ్లీ

Virat Kohli reveals why he and Anushka not sharing pictures of Vamika on social media

ముంబై: తన కూతురు 'వామికా' ఫొటోలు బయటపెట్టకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలియజేశాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. ఈ క్వారంటైన్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. 'In quarantine..Ask me your questions'అనే క్యాప్షన్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు.

సోషల్ మీడియా తెలిసేవరకు..

సోషల్ మీడియా తెలిసేవరకు..

అయితే ఈ చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ ముందు తన గారాల పట్టి వామికా గురించి ప్రస్తావించాడు. అసలు 'వామికా' అంటే అర్థం ఏంటని? ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించాడు. దీనికి విరాట్ స్పందిస్తూ.. వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక వామికా పుట్టిన సందర్భంగానే పప్పరాజీలు(ఫొటోగ్రాఫర్లకు) తమ కూతురి ప్రైవసీ భంగం కలిగించకుండా ఉండాలని, ఫొటోలు తీయవద్దని ఈ జోడీ విజ్ఞప్తి చేసింది. వారి రిక్వెస్ట్‌ను బేఖాతరు చేసిన ఫొటోగ్రాఫర్లపై అనుష్క ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు వామికా ముఖం కనిపించేలా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.

నా హెడ్‌సెట్ ఎక్కడా..

నా హెడ్‌సెట్ ఎక్కడా..

ఇక ఫ్యాన్స్‌తో కోహ్లీ సీరియస్‌గా చిట్ చాట్ చేస్తుండగా.. మధ్యలోకి అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వచ్చింది. ముందు నా హెడ్‌ఫోన్స్ ఎక్కడ పెట్టావో చెప్పు అని అడిగింది.

దీనికి కోహ్లీ స్పందిస్తూ.. ఎప్పుడూ పెట్టినట్లే మన బెడ్ పక్కనే పెట్టానని బదులిచ్చాడు.ఇక తాను చివరిసారి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ట్రాన్స్‌ఫర్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు చెప్పాడు. ట్రైనింగ్ తీసుకుంటూ ఫ్యామిలీని గడుపుతూ క్వారంటైన్ గడుపుతున్నానన్నాడు. ఇక ట్రోల్స్, మీమ్స్‌పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. నేను చూసుకుంటా అనే అర్థంలోని ఓ ఫొటోను షేర్ చేశాడు.

స్పినాచ్ ఎక్కువగా తింటా..

స్పినాచ్ ఎక్కువగా తింటా..

ఇక తాను తినే ఆహారం ఎంటో చెప్పాలని ప్రశ్నించగా.. కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు తింటానన్నాడు. అయితే అన్నీ కంట్రోల్‌గా తీసుకుంటానని తెలిపాడు. చాహల్ చాలా సరదా మనిషని, ఏబీడి తెలివైనవాడని, జెమీసన్ సిగ్గరని తెలిపాడు. ఈ చిట్ చాట్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా పాల్గొన్నాడు. కోహ్లీ నుంచి ఆసక్తికరమైన సమధానాలు రాబట్టాడు. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పట్ల ఉన్నఅభిప్రాయాన్ని రెండు ముక్కల్లో చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని అశ్విన్ కోరాడు..

నమ్మకం, గౌరవం..

నమ్మకం, గౌరవం..

ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ పట్ల తన మనసులో మాటను బయటపెట్టాడు కోహ్లీ. ధోనీ అంటే తనకు నమ్మకం..గౌరవం ఉన్నాయని రెండు ముక్కల్లో తేల్చేశాడు. టీమిండియాకు ఎంపికైన తొలిరోజుల్లో తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు ఎంపికైతే చాలనుకున్నానని, బెంచ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఉండాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పారు.

Story first published: Sunday, May 30, 2021, 18:44 [IST]
Other articles published on May 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+