అనుష్కతో కోహ్లీ మొదటిసారి ఏం మాట్లాడాడో తెలుసా?

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మది ప్రేమ వివాహం. 2013లో సినిమాలతో అనుష్క, క్రికెట్‌తో విరాట్ కోహ్లీ బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరు కలిశారు. స్నేహంతో చిగురించిన వీరి ప్రేమబందంలో అడ్డంకులు, అలకలు, ఆప్యాయతలు కూడా ఉన్నాయి. అన్నిటిని దాటి చివరికి 2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అయితే అనుష్కతో కోహ్లీ మొదటిసారి ఏం మాట్లాడాడో తెలుసా?.

రొమాంటిక్‌గా ఏమీ సాగలేదు:
అమెరికాకు చెందిన స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహమ్‌బెరసింజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ తొలిసారి తనకు పరిచయం ఎలా అయిందో కోహ్లీ తెలిపాడు. అంతేకాదు అనుష్కతో మాట్లాడిన తొలి మాటలు ఏంటో చెప్పాడు. అయితే వీరిద్దరి తొలి పరిచయం అంత రొమాంటిక్‌గా ఏమీ సాగలేదు. కోహ్లీ మొదటి మాటలతోనే అనుష్క ఫీలయింది.

జోక్ వేస్తే ఫీలయింది:
'అనుష్కను తొలిసారి ఓ షాంపూ ప్రకటన కోసం కలిసా. తొలిసారి తనను చూసినప్పుడే ఎలాగైనా ఆమెతో మాట్లాడనుకున్నా. మంచి జోక్ వేస్తే బాగుంటుందని అనుకున్నా. వెంటనే అనుష్క వేసుకున్న హీల్స్ గురించి కామెంట్ చేస్తూ.. ఇంతకన్నా ఎత్తైన హీల్స్ దొరకలేదా? అంటూ తన పొడవును ఉద్దేశించి జోక్ వేశా. దానికి అనుష్క నుంచి సరైన రీతిలో సమాధానం రాలేదు. అప్పటికే అనుష్క మేనేజర్ కోహ్లీ 6 అడుగుల ఎత్తు ఉండడు కాబట్టి హీల్స్ వేసుకోవద్దని చెప్పాడట. నాకు తెలియక అదే జోక్ వేయడంతో అనుష్క ఫీలయింది' అని కోహ్లీ తెలిపాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్.. 15 ఏళ్ల టెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్

పూర్తి సమయం కోహ్లీతోనే:
ఆ ఘటన తర్వాత ఇద్దరూ తరచూ కలుసుకోవడంతో స్నేహం పెరిగింది. అది కాస్త ప్రేమగా చిగురించింది. ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క సినిమాలు తగ్గించి పూర్తి సమయం కోహ్లీ కోసం వెచ్చిస్తోంది. ఈ మధ్య కాలంలో కోహ్లీ వెళ్లిన ప్రతీ పర్యటనకు అనుష్క వెళుతోంది. ఇటీవలే ప్రపంచ కప్, విండీస్ పర్యటనలకు వెళ్ళింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications