బంగ్లాదేశ్‌తో టెస్ట్.. 15 ఏళ్ల టెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్

చిట్టగాంగ్: అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మన్ రహ్మత్ షా, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డుల్లో నిలిచారు. బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టులో సెంచరీ బాదిన రహ్మత్ షా (187 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. సెంచరీ బాదిన 'షా' అఫ్గాన్ తరఫున తొలి సెంచరీ అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. బంగ్లాతో టెస్టులో అఫ్గాన్‌కు నాయకత్వం వహించడం ద్వారా రషీద్ ఖాన్ అతి చిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

రహ్మత్ షా రికార్డు సెంచరీ:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (21), ఇహ్‌సానుల్లా (9 )త్వరగానే పెవిలియన్ చేరారు. లంచ్ సమయానికి హష్మతుల్లా షహీదీ (14) కూడా ఔట్ కావడంతో అఫ్గాన్ 77/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో షా, అస్గర్ (160 బంతుల్లో 88 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు నాలుగో వికెట్‌కు 120 పరుగుల జోడించి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో అఫ్ఘాన్ తరఫున టెస్ట్‌ల్లో తొలి శతకం సాధించిన ఆటగాడిగా షా చరిత్ర సృష్టించాడు.

ఆదుకున్న అస్గర్:

రషీద్ ఖాన్ రికార్డు:
ఈ మ్యాచ్‌తో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రికార్డుల్లోకెక్కాడు. టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడి (20 ఏండ్ల 350 రోజులు)గా రషీద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ తతెంద తైబూ (20 ఏండ్ల 358 రోజులు) పేరిట ఉంది. 1962లో 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత్‌కు సారథ్యం వహించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ మూడో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications