Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి వన్డేకి ముందు నెట్స్‌లో బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ఏం జరిగిందంటే!: కోహ్లీ

Virat Kohli reveals What Happened When He Faced the Bumrah in Nets Ahead of 1st ODI

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా మంగళవారం జరగనుంది. తొలి వన్డే కోసం ఇప్పటికే ముంబైకి చేరుకున్న ఇరు జట్లు సోమవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. నెట్స్‌లో టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా... కోహ్లీకి ఎక్కువ బంతులు సంధించాడు.

అయితే, బుమ్రా బౌలింగ్‍‌లో కోహ్లీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించగా... కోహ్లీని బుమ్రా ఔట్ చేశాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీ తొలి వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ "నా అభిప్రాయం ప్రకారం అతడు(బుమ్రా) ఏ ఫార్మాట్‌లోనైనా ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన బౌలర్. నెట్స్‌లో సైతం అతనికి వ్యతిరేకంగా ఆడేటప్పుడు నిజమైన మ్యాచ్ స్థాయి తీవ్రతను తెస్తాడు" అని అన్నాడు.

బుమ్రా ఓ అద్భుతమైన బౌలర్

"అతను ఓ అద్బుతమైన బౌలర్. నెట్స్‌లో అత్యుత్తమంగా ఆడటం ఎల్లప్పుడూ మంచిది. అతనికి వ్యతిరేకంగా బాగా ఆడాలని నేను నన్ను సవాల్ చేసుకుంటాను. నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో బౌండరీలు కొట్టనీయడు. దాదాపు నాలుగేళ్ల నుంచి బుమ్రా జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో నెట్స్‌లో ఔట్‌ కావడం ఇది రెండోసారి అనుకుంటా" అని కోహ్లీ అన్నాడు.

నెట్స్‌లో అతని బౌలింగ్‌లో హిట్‌ చేస్తా

నెట్స్‌లో అతని బౌలింగ్‌లో హిట్‌ చేస్తా

"నెట్స్‌లో అతని బౌలింగ్‌లో హిట్‌ చేస్తా. అయితే తాజా నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా చివరి బంతికి ఔటయ్యా. అతనొక అసాధారణ బౌలర్‌. నెట్స్‌లో కూడా బుమ్రా సీరియస్‌గానే బౌలింగ్‌ చేస్తాడు. మీకు ఒక విషయాన్ని చెబుతున్నా. మమ్ముల్ని టార్గెట్‌ చేస్తూ బౌలింగ్‌ చేయడానికి బుమ్రా వెనుకాడాడు. మా తలపై, చేతులపై బంతితో హిట్‌ చేయడానికి కూడా బుమ్రా సిగ్గ పడడు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కపిల్‌దేవ్‌ బయోపిక్.. శ్రీకాంత్ పాత్రలో 'జీవా' ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ఇదే!!

వాంఖడే వేదికగా తొలి వన్డే

వాంఖడే వేదికగా తొలి వన్డే

ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు వన్డేల సిరిస్ కోసం ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాలు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. తన ఫామ్‌ను కొనసాగించాలని కోహ్లీ భావిస్తుండగా, గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమై బుమ్రా తిరిగి లయను అందుకోవాలని చూస్తున్నాడు.

Story first published: Monday, January 13, 2020, 17:34 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+