ఆ విషయం తెలిశాక మేఘాల్లో తేలిపోయా: కోహ్లీ

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతని భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవలే ఓ శుభవార్తను అందించిన విషయం తెలిసిందే. తాను తల్లి కాబోతున్నట్లు పేర్కొంటూ అనుష్క .. భర్త విరాట్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'ఇప్పుడు మేం ముగ్గురం కాబోతున్నాం' అంటూ ట్వీట్ చేశారు. కాబోయే తండ్రిగా తన అనుభూతిని తాజాగా అభిమానులతో మరోసారి పంచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

మేఘాల్లో తేలిపోయాం:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యూట్యూబ్ ఛానల్ ఆర్‌సీబీ డైరీస్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. తండ్రి కాబోతున్న తరుణంలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'అదో అనిర్వచనీయమైన అనుభూతి. నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ విషయం తెలిశాక మేమిద్దరం మేఘాల్లో తేలిపోయాం. ఈ వార్తను పంచుకున్నాక అభిమానులు మాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మా మధ్యలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

మనకిష్టమైన వ్యక్తితో సొంత ఇంట్లోనే:
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఆస్వాదించానని విరాట్ కోహ్లీ అన్నాడు. తన సతీమణి అనుష్క శర్మతో అంత సమయం కలిసి ఉండడం అదే తొలిసారని చెప్పాడు. 'లాక్‌డౌన్‌లో నేను, అనుష్క ఇంట్లోనే ఉన్నాం. మేం ఎప్పుడూ అంత సమయం కలిసి ఉండలేదు. నిజం చెప్పాలంటే మా పరిచయం అయినప్పటి నుంచీ అన్ని రోజులు కలిసి ఉన్నది ఇదే తొలిసారి. ఎప్పుడూ ఇలాంటి అవకాశం రాలేదు. మనకిష్టమైన వ్యక్తితో సొంత ఇంట్లోనే అలా ఉండటానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. మేమిద్దరం మంచి సమయాన్ని ఆస్వాదించాం' అని చెప్పాడు.

ఛాంపియన్‌గా నిలవాలని:
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా విజేత కాలేకపోయిన బెంగళూరు జట్టు ఈసారి ఛాంపియన్‌గా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మొదలవుతున్న ఐపీఎల్ 13వ సీజన్ కోసం దుబాయ్ చేరుకున్న అన్ని జట్టు క్వారంటైన్‌ను ముగించుకున్నాయి. పలువురికి కరోనా సోకడంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మినహా అన్ని జట్లు బయో సెక్యూర్ విధానంలో శిక్షణ మొదలుపెట్టాయి. సీఎస్‌కే జట్టులో కరోనా సోకిన 13 మంది మినహా మిగతావారు కూడా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తాజాగా అనుమతులు లభించాయి.
Delhi Capitals: నేను సామాజిక దూరం పాటిస్తున్నా.. పాంటింగ్‌కు అశ్విన్ పంచ్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications