Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Delhi Capitals: నేను సామాజిక దూరం పాటిస్తున్నా.. పాంటింగ్‌కు అశ్విన్ పంచ్!!

Ravichandran Ashwin maintains social distance from Ricky Ponting

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో క్వారంటైన్‌ పూర్తవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లన్నీ ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్ రికీ పాంటింగ్‌ సమక్షంలో ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. దుబాయ్‌లో వారం రోజుల పాటు సెల్ప్‌ ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న పాంటింగ్..‌ ఆటగాళ్ల నెట్స్‌ సెషన్‌ను దగ్గరుండి మరీ పర్యవేక్షించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బృందంతో సమావేశమైన రికీ ఆటగాళ్లతో ముచ్చటించాడు.

ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తదితరలు మంగళవారం నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రాక్టీస్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌‌తో కలిసి రికీ పాంటింగ్‌ మాట్లాడుతుండగా.. వెనుక నుంచి కొద్ది దూరంలో ఆర్ అశ్విన్ నవ్వుతూ కనిపించాడు. ఆ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన అశ్విన్.. పాంటింగ్‌కు పంచ్ ఇచ్చే రీతిలో క్యాప్షన్ పెట్టాడు.

'రికీ పాంటింగ్, నేను సామాజిక దూరం పాటిస్తున్నాం' అని ఆర్ అశ్విన్ ఆ ఫోటోకి కాప్షన్ పెట్టాడు. దీంతో మాన్కడింగ్ గురించి అశ్విన్‌తో ఇంకా పాంటింగ్ చర్చించలేదని స్పష్టమైంది. యూఏఈలో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ మొదలైన తర్వాత అశ్విన్‌తో మాన్కడింగ్ విషయమై మాట్లాడతానని పాంటింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అశ్విన్‌ను ఈసారి అలా చేయనివ్వనని చెప్పాడు. అందుకే అశ్విన్ ఫోటోకి అలా సరదాగా స్పందించాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఆర్ అశ్విన్.. జోస్ బట్లర్‌ని మాన్కడింగ్‌ చేయడం ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. మాన్కడింగ్‌ తాను క్రికెట్‌ రూల్స్‌కి లోబడే చేసినట్లు అశ్విన్ వివరణ ఇచ్చుకున్నాడు. కానీ అతను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మాన్కడింగ్ చేసినట్లు చాలా మంది మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడబోతున్నాడు. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో అశ్విన్‌ని మాన్కడింగ్ చేయనివ్వనని పాంటింగ్ ఇటీవల స్పష్టం చేశాడు. అందుకే అశ్విన్ అలా ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, September 2, 2020, 14:28 [IST]
Other articles published on Sep 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+