Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్‌ది మాములు దిమాక్ కాదు.. కవర్స్‌లో ఆడమని చెబితే.. బౌలర్‌నే ఆగం జేసిండు: విరాట్ కోహ్లీ (వీడియో)

 Virat Kohli Reveals Conversation With Ashwin In Last Over against Pakistan, Says That Was Very Brave

మెల్‌బోర్న్: యావత్ క్రికెట్‌ ప్రపంచం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కొనియాడుతుంటే.. అతను మాత్రం స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆకాశానికెత్తాడు. అశ్విన్‌ది మాములు దిమాక్ కాదని, తనతో పాటు పాక్ ఆటగాళ్లందరిని పిచ్చోళ్లను చేశాడని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్లతో చిరస్మరణీ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు.

అశ్విన్ మాస్టర్ మైండ్..

హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యా ఔటైనా.. విరాట్ పట్టు వదల్లేదు. తన వీరోచిత పోరాటానికి కాసింత లక్‌ను కూడా కలుపుకొని జట్టును విజయం ముంగిట నిలబెట్టాడు. అయినా భారత్‌‌ను దరిద్రం వెంటాడింది. చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో దినేశ్ కార్తీక్ అనవసరంగా వైడ్ బాల్ గెలికి స్టంపౌటయ్యాడు. దాంతో భారత్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠ తారా స్థాయికి చేరగా.. క్రీజులోకి వచ్చిన అశ్విన్ మాత్రం తన తెలివిని ప్రదర్శించాడు.

ముందే పసిగట్టి..

తాను కూడా ఓ స్పిన్నర్ కావడంతో మహమ్మద్ నవాజ్ వ్యూహాన్ని పసిగట్టాడు. తనను కూడా దినేశ్ కార్తీక్ తరహాలో వైడ్ బాల్‌కు బోల్తా కొట్టిస్తాడని గ్రహించాడు. వికెట్లను వదిలి స్ట్రైక్ తీసుకున్న అతను బంతి పడగానే దాన్ని గమనాన్ని గమనించి లోపలికి జరిగాడు. దాంతో ఆ బంతి కాస్త వైడ్‌గా మారి భారత్‌కు అదనపు పరుగు లభించింది. దాంతో చివరి బంతికి సింగిల్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క రన్‌ ఆపేందుకు పాక్‌ ఫీల్డర్లంతా సర్కిల్‌ లోపలికి రాగా.. అశ్విన్‌ మాత్రం.. సింపుల్‌గా లాంగాఫ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో సింగిల్‌ తీసి మ్యాచ్‌ను ఈజీగా గెలిపించాడు. అశ్విన్ ఏ మాత్రం ఏమరపాటుకు గురైనా కోట్లాది మంది హృదయాలు ముక్కలయ్యేవి.

నా మాట వినకుండా..

నా మాట వినకుండా..

విరాట్ కోహ్లీ కూడా అశ్విన్ సమయస్పూర్తిని కొనియాడాడు. అతనిది మాములు దిమాక్ కాదని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం హిందీ కామెంటేటర్లతో ముచ్చటించిన విరాట్.. ఆఖరి బంతికి ముందు అశ్విన్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు. 'చివరి బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా ఆడాలని అశ్విన్‌‌కు చెప్పాను. అతను మాత్రం తన ఎక్స్‌ట్రా మైండ్‌ను ఉపయోగించి వైడ్ బాల్‌గా మార్చాడు. దాంతో చివరి బంతిని మరింత కూల్‌గా గ్యాప్‌లోకి కొట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.'అని విరాట్ కోహ్లీ నవ్వుతూ చెప్పాడు.

Story first published: Monday, October 24, 2022, 15:56 [IST]
Other articles published on Oct 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+